Geetu Royal: అమ్మవారిని దర్శించుకోలేకపోయా.. అందుకే ఇలా.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి గీతూ రాయల్ వీడియో

|

Apr 29, 2024 | 5:31 PM

బిగ్ బాస్ రియాలిటీ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో గీతూ రాయల్ ఒకరు. సీజన్ 6 లో అడుగుపెట్టిన గీతూ తనదైన ఆటతీరుతో బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. అయితే తన ఓవరాక్షన్ తో ఊహించని విధంగా హౌజ్ నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ లకు రివ్యూలు చెప్పడంతో పాటు ఏడో సీజన్ బిగ్ బాస్ బజ్‌కు హోస్ట్ గా వ్యవహరించింది.

Geetu Royal: అమ్మవారిని దర్శించుకోలేకపోయా.. అందుకే ఇలా.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి గీతూ రాయల్ వీడియో
Geetu Roayal
Follow us on

బిగ్ బాస్ రియాలిటీ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో గీతూ రాయల్ ఒకరు. సీజన్ 6 లో అడుగుపెట్టిన గీతూ తనదైన ఆటతీరుతో బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. అయితే తన ఓవరాక్షన్ తో ఊహించని విధంగా హౌజ్ నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ లకు రివ్యూలు చెప్పడంతో పాటు ఏడో సీజన్ బిగ్ బాస్ బజ్‌కు హోస్ట్ గా వ్యవహరించింది. ఇదిలా ఉంటే ఎప్పుడూ హుషారుగా, ఫుల్ జోష్ లో ఉండే గీతూ రాయల్ సడెన్ గా ఆస్పత్రి బెడ్ పై దర్శనమిచ్చింది. తాను ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నానంటూ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేసింది. ‘ నేను గత 5 నెలలుగా నరకం అనుభవిస్తున్నాను. బ్యాక్టిరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ప్రతి వారం ఇంజెక్షన్లు చేయించుకుంటున్నాను. దీనికి కారణం బ్యాంకాక్ పర్యటనే అనుకుంటున్నాను. అక్కడ రకరకాల ఫుడ్ ఐటమ్స్ తిన్నాను. ఇదే నా పరిస్థితికి కారణమనిపిస్తోంది. అలాగే ఒకసారి విజయవాడకు వెళ్లి అమ్మవారిని దర్శించుకోకుండా వచ్చేశాను. ఈ రెండు సంఘటనల తర్వాతే నేను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. గత ఐదు నెలలుగా నా పరిస్థితేమీ బాగోలేదు. చాలా డిప్రెషన్ కు లోనవుతున్నాను’.

ఆ రెండు సంఘటనల తర్వాతే.. ఇలా అయ్యింది..

‘ మొదట నాకు ఒక గాయమైంది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. చివరగా ఒక పెద్ద ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ పరీక్షలు చేయించుకున్నాను. అప్పుడు అసలు విషయం తెలిసింది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని డాక్టర్లు చెప్పడంతో నిర్ఘాంత పోయాను. ఇది క్యూర్ అవ్వడానికి సుమారు రెండేళ్ల పాటు ట్రీట్ మెంట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు . అలాగే ప్రతి వారం ఒక ఇంజెక్షన్, అలాగే క్రమం తప్పకుండా మందులు కూడా వాడాలట. డాక్టర్ చెప్పిన మాటలతో నేను బాగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. ప్రస్తుతం కొంత మేర బాగానే ఉంది. వైద్యులు చెప్పినట్లు ప్రకారం నా లైఫ్ స్టైల్ ను మార్చుకోవాలి. లేకపోతే 40 ఏళ్లకు మించి బతకడం కష్టమన్నారు’ అని ఎమోషనలైంది గీతూ. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఆమె త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, నెటిజన్లు ప్రార్థిస్తున్నారు. అలాగే ధైర్యంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గీతూ రాయల్ ఇంకా ఏం చెప్పిందో ఈ కింది వీడియోలో చూడండి..


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.