Mahesh Babu: మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఆ హీరోయిన్ కూడా..
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మహేష్ బాబు రీసెంట్ గా గుంటూరుకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమా హిట్ అందుకోలేకపోయింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత వస్తున్న మూవీ కావడమతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మహేష్ బాబు రీసెంట్ గా గుంటూరుకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమా హిట్ అందుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ను మాత్రం బాగానే ఆకట్టుకుంది. దాంతో ఇప్పుడు రాజమౌళి సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.
రాజమౌళి సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని ఇప్పటికే స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చారు. అంతే కాదు మహేష్ బాబు ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. మహేష్ బాబు లాంగ్ హెయిర్ లో కనిపించనున్నారు . ఈ సినిమాలో హాలీవుడ్ నటి మహేష్ బాబుకు జోడీగా నటిస్తుందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే త్వరలోనే ఈ సినిమా కాన్సెప్ట్ గురించి ఓ భారీ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి రోజుకొక వార్త వినిపిస్తూనే ఉంది. తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాలో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. మహేష్ బాబు సిమ్రాన్ కలిసి యువరాజు సినిమాలో నటించారు. ఇప్పుడు మహేష్ సినిమాలో సిమ్రాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. గతంలో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ కీలకపాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో సిమ్రాన్ నటిస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ వార్తల పై క్లారిటీ రానుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.