Bigg Boss 9 Telugu : అక్క అలిగింది.. భరణి మైండ్ బ్లాంక్ అయ్యింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు తుది దశకు చేరుకుంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే పదో వారం ఎండింగ్ కు చేరుకుంది. ఇక ఈ సీజన్ లో కేవలం ఆరు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో ఈ షోపై ఉత్కంఠ తీవ్ర స్థాయికి చేరుతోంది. దీనికి తోడు పదో వారం నామినేషన్స్ ఈ సీజన్ లో ఎప్పుడూలేనంత ఉత్కంఠగా సాగాయి.

Bigg Boss 9 Telugu : అక్క అలిగింది.. భరణి మైండ్ బ్లాంక్ అయ్యింది.
Bigg Boss9

Updated on: Nov 15, 2025 | 8:34 AM

బిగ్ బాస్ హౌస్ లో తాజాగా కొత్త కెప్టెన్ అయ్యింది తనూజ. రాజులు, రాణులు అంటూ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.. కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచిన నిఖిల్, తనూజ, రీతూ ముగ్గురు మిగిలారు. ఈ ముగ్గురికి కలిపి ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. హోల్డ్ ది క్రౌన్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్కులో తమ ఫొటోకి పెట్టిన కిరీటాన్ని కత్తితో కిందపడకుండా ఎక్కువసేపు ఉంచాలి. ఎవరు చివరి వరకూ ఉంటే వాళ్లు విన్ అవుతారు అని తెలిపాడు. దాంతో తనూజ, రీతూ, నిఖిల్ టాస్క్ లో పాల్గొన్నారు. ఎవరైతే విన్ అవుతారో.. వారు కెప్టెన్ అవ్వడంతో పాటు ఇమ్యూనిటీ కూడా పొందుతారు.

ఈ టాస్క్ లో ముందుగా రీతూ ఔట్ అయ్యింది. ఎక్కువ సేపు కత్తి పట్టుకొని రీతూ ఉండలేకపోయింది. ఆతర్వాత నిఖిల్, తనూజ పోటీ పడ్డారు.. సంచలక్ గా ఉన్న సుమన్ శెట్టి.. ఇద్దరిలో ఒకరి కత్తికి యాపిల్ ను వేలాడదీయాలని చెప్పాడు. దాంతో సంజన తనూజాకు కాకుండా నిఖిల్ కత్తికి యాపిల్ ను వేలాడదీసింది. దాంతో ఆ బరువుకు నిఖిల్ కత్తిని ఎక్కువ సేపు ఉంచలేకపోయాడు. దాంతో నిఖిల్ అవుట్ అయ్యి తనూజ విన్ అయ్యింది.

తనూజ విన్ అవ్వగానే భరణి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే తనుజను ఎత్తుకున్నాడు. కెప్టెన్ అయిన తనుజ కోసం బిగ్ బాస్ ఓ స్పెషల్ లెటర్ పంపించి ఆమెను సింహాసనం పై కూర్చోబెట్టారు. కిరీటం పెట్టి పట్టాభిషేకం కూడా చేశాడు బిగ్ బాస్. హమ్మయ్యా ఫైనల్లీ.. ఇక నేను ప్రశాంతంగా పడుకుంటాను అంటూ తనూజ తెలిపింది. ఆ తర్వాత భరణితో దివ్య మాట్లాడింది. నేను ఇంకొక సింపుల్ కొశ్చన్ అడుగుతా.. దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్తే నేనే మీతో మాట్లాడటం మానేస్తా.. నేను కెప్టెన్ అయినప్పుడు నన్ను ఎందుకు ఎత్తుకోలేదు..? అంటే నేను బరువుగా ఉన్నాననా..? లేదంటే మీకు అంత హ్యాపీగా అనిపించలేదా..? అని దివ్య అడిగింది. దాంతో భరణికి మైండ్ బ్లాక్ అయ్యింది. ఏం చెప్పాలో అర్ధంకాలేదు. ఆ టైం లో నువ్వు చాలా బిజీగా ఉన్నావ్.. నీకు కంగ్రాట్స్ చెప్పాను.. ఫొటో పెట్టమన్నావ్ పెట్టాను.. అని భరణి అన్నాడు.. మొత్తానికి అక్క అలిగింది అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో మీమ్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.