సినిమా ఇండస్ట్రీలో స్టార్ వారసులు
సినిమాల్లో ఎప్పుడూ ఓ సీజన్ నడుస్తుంటుంది. లవ్, థ్రిల్లర్స్, హారర్.. ఇలా... ఇదంతా స్క్రీన్ మీద సందడి. కానీ ఇప్పుడు ఆన్ లొకేషన్‌లోనూ ఓ సిమిలారిటీని గమనిస్తున్నారు జనాలు. ఇంతకీ ఏంటది? ఈ ఏడాది క్రిస్మస్‌కి చాంపియన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు రోషన్. ఈ యంగ్‌స్టర్‌ని చూసిన వారందరూ శ్రీకాంత్‌ని గుర్తుచేసుకుంటున్నారు. తండ్రీకొడుకులు షూటింగులతో యమా బిజీగా ఉన్నారని మాట్లాడుకుంటున్నారు.
సినిమాల్లో ఎప్పుడూ ఓ సీజన్ నడుస్తుంటుంది. లవ్, థ్రిల్లర్స్, హారర్.. ఇలా… ఇదంతా స్క్రీన్ మీద సందడి. కానీ ఇప్పుడు ఆన్ లొకేషన్‌లోనూ ఓ సిమిలారిటీని గమనిస్తున్నారు జనాలు. ఇంతకీ ఏంటది? ఈ ఏడాది క్రిస్మస్‌కి చాంపియన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు రోషన్. ఈ యంగ్‌స్టర్‌ని చూసిన వారందరూ శ్రీకాంత్‌ని గుర్తుచేసుకుంటున్నారు. తండ్రీకొడుకులు షూటింగులతో యమా బిజీగా ఉన్నారని మాట్లాడుకుంటున్నారు. విజయ్ తనయుడు జేసన్ కూడా తన ఫస్ట్ ప్రాజెక్టుతో ప్రేక్షకులను పలకరించేశారు. సందీప్ కిషన్ హీరోగా జేసన్ డైరక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ సిగ్మా డీటైల్స్ ఆకట్టుకుంటున్నాయి. జేసన్ కోసం విజయ్ ఇంకా ప్రమోషన్ల స్టేజ్‌కి రాలేదు. కానీ, తనయుడు సూర్య సేతుపతి కోసం, ఆయన నటించిన ఫీనిక్స్ మూవీ కోసం ప్రమోషన్లకు హాజరయ్యారు విజయ్ సేతుపతి. ఓ వైపు తండ్రి రకరకాల యాక్టివిటీస్‌తో దూసుకుపోతుంటే, ఆయనకు తగ్గ వారసుడు అనిపించుకోవడానికి సూర్య కూడా రెడీ అవుతున్నారు. తన తండ్రి గురించి అత్యంత గొప్పగా చెప్పి, భవిష్యత్తులో తన కొడుకు కూడా తనని తలచుకుని అంతే గర్వంగా ఫీలవ్వాలని చెప్పారు ధ్రువ్. బైసన్ తెలుగు ప్రమోషన్లలో ఆడియన్స్ ని ఫిదా చేసేశారు ధ్రువ్. మన దగ్గరే కాదు, నార్త్ లోనూ పుత్రోత్సాహ కనిపిస్తోంది. రీసెంట్‌గా షారుఖ్ ఆ ఉత్సాహాన్ని టేస్ట్ చేశారు. ఆర్యన్‌ఫస్ట్ ప్రాజెక్ట్ ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్‌కి ఇంప్రెస్ అయ్యారు షారుఖ్. సెటైరికల్ యాక్షన్ కామెడీ డ్రామా సీరీస్‌గా తెరకెక్కిందీ ప్రాజెక్ట్. ఫ్యూచర్‌లో ఆర్యన్ తనను హ్యాండిల్ చేయగలిగితే డేట్స్ ఇస్తానని కూడా రీసెంట్‌గా ఓపెన్ అయ్యారు షారుఖ్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మన విద్యార్థులకు రష్యా బంపర్ ఆఫర్.. 300 ఉచిత స్కాలర్‌షిప్‌లు
సత్తాచాటిన తెలుగోడు.. శ్రీనగర్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం
ఆ 3 గంటలు కారులో ఎందుకు ఉండిపోయాడు?
అమెరికన్లకు శిక్షణ ఇచ్చి వెళ్లిపోండి.. హెచ్-1బీ వీసాలపై ట్రంప్ కొత్త స్వరం
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

