నీ ఓవరాక్షన్ నచ్చలేదు.. ఎందుకంత ఆటిట్యూడే నీకు..! రెచ్చిపోయిన ముద్దుగుమ్మలు

బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం నామినేషన్స్ గరం గరంగా జరిగాయి.. ఈ వారం ఏకంగా ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉన్నారు. కళ్యాణ్, సంజన, దివ్య, రాము, రీతూ చౌదరి, తనూజ, రమ్య, సాయి నామినేషన్స్ లో ఉన్నారు.

నీ ఓవరాక్షన్ నచ్చలేదు.. ఎందుకంత ఆటిట్యూడే నీకు..! రెచ్చిపోయిన ముద్దుగుమ్మలు
Bigg Boss 9

Updated on: Oct 21, 2025 | 9:31 AM

బిగ్ బాస్ సీజన్ 9లో నిన్నటి ఎపిసోడ్ ఓ రేంజ్ లో జరిగింది. ఈ వారం నామినేషన్స్ లో హౌస్ మేట్స్ రెచ్చిపోయారు. ఆదివారం ఎపిసోడ్ లో భరణి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. భరణి ఎలిమినేట్ అవ్వడంతో దివ్య కన్నీళ్లు పెట్టుకుంది. ఇక సోమవారం రోజున నామినేషన్స్  మొదలు పెట్టారు. ముందుగా సుమన్ శెట్టి-గౌరవ్ కెప్టెన్స్‌గా మీకు స్పెషల్ పవర్ లభిస్తుందని మీకు తెలుసు కదా.. అక్కడ రెండు పిల్స్ ఉన్నాయి ఒకటి రెడ్, మరొకటి బ్లూ.. ఒక్కో పిల్‌ వేరు వేరు శక్తిని కలిగి ఉంటాయి.. ఇప్పుడు మీరిద్దరూ మీకు కావాల్సిన పిల్‌ని ఎంచుకోండి.. అని బిగ్‌బాస్ చెప్పాడు. దాంతో సుమన్, గౌరవ్ ఇద్దరూ బ్లూ కావాలని కొద్దిసేపు గొడవపడ్డారు.

చివరికి సుమన్ రెడ్ తీసుకోగా.. గౌరవ్ బ్లూ తీసుకున్నాడు. అయితే సుమన్ కు కలిసొచ్చింది.. సుమన్ మీకు సేవ్ యుఆర్ సెల్ఫ్ వచ్చిన కారణంగా మీరు ఈ వారం నామినేషన్స్‌ నుంచి సేవ్ అయ్యారు.. గౌరవ్ మిమ్మల్ని ఇంటి సభ్యులు నామినేట్ చేసే అవకాశం ఉంది అని చెప్పాడు బిగ్ బాస్.  ఇమ్మనుయేల్-అయేషా కు ఓక టాస్క్ ఇచ్చాడు. అక్కడ కొన్ని బెలూన్స్‌ పెట్టి వాటిలో నామినేషన్స్ టికెట్లు దాగి ఉన్నాయి.. ఆ టికెట్లు పొందినవారికి ఈ వారం నామినేట్ చేయడానికి కావాల్సిన వివిధ శక్తులు లభిస్తాయి. అని చెప్పాడు దాంతో ఇమ్మనుయేల్-అయేషా ఇద్దరూ పోటీపడ్డారు. అయేషాకి మొత్తం మూడు టికెట్లు, ఇమ్మానుయేల్‌కి ఐదు టికెట్స్ వచ్చాయి. ఇక ఇమ్మానుయేల్‌ తన దగ్గరున్న టికెట్స్ ను కళ్యాణ్, దివ్య, తనూజ, రీతూ, రమ్యకి ఇచ్చాడు. అయేషా.. సాయి, సంజనకి టికెట్స్ ఇచ్చింది. డైరెక్ట్ నామినేట్ టికెట్ తన దగ్గర ఉంచుకుంది.

ఆతర్వాత అసలు కథ మొదలైంది.. వెంటనే రీతూ చౌదరిని నామినేట్ చేసింది అయేషా. ఫోమ్ ముఖాన కొట్టి నామినేట్ చేసింది అయేషా.. రీతూ ఫోమ్ తుడుచుకుంటుంటే.. నీకోసం అందరూ వెయిట్ చేయాలా.. తుడ్చుకోవడానికి అయితే  ఫోమ్ ముఖానకొట్టమని ఎందుకు చెప్తారు అంటూ అయేషా సీరియస్ అయ్యింది. నేను మాట్లాడుతున్నానో లేదో తెలియాలి కదా ఆన్సర్ ఇచ్చింది. నువ్వు నీ ఓవరాక్షన్ ఈ ఇంట్లో నాకు అసలు నచ్చలేదు.. నువ్వు వచ్చిందే లవ్ కంటెంట్ కోసం.. అది చాలా సేఫ్ ప్లే అందుకే నాకు నచ్చడం లేదు అని అయేషా తన పాయింట్ చెప్పింది. దానికి రీతూకి కాలింది. నేను చెప్పానా లవ్ చేస్తున్నాను లవ్ చేసి తిరుగుతున్నాను అని.. అని రివర్స్ అయ్యింది. దాంతో అయేషా కూడా నోరు పెంచింది. నాకు ఒక ఆడియన్‌గా అలా కనిపించింది.. నా రీజన్ నాకు ఉంది.. మిగతావాళ్లంతా చూస్తున్నారు రీతూ నేనేం ఫూల్ కాదు.. నాకు అయితే నీ ఓవరాక్షన్ నచ్చలేదు.. నువ్వు ఇక్కడుంటే బాలేదు.. అందుకే నువ్వు బయటికెళ్లిపోవాలని నామినేట్ చేస్తున్నాను అని సీరియస్ గా చెప్పి వెళ్లి కూర్చుంది. నేను డిఫైన్ చేసుకోవాలి కదా రా అని అయేషాను పిలిచింది రీతూ.. నాకేం వినాలని లేదు అంటూ యాటిట్యూడ్ తో సమాధానం చెప్పింది అయేషా..ఆతర్వాత ఇద్దరి మధ్య ఓ రేంజ్ లో వాదన జరిగింది.. నాకు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో అర్థమైంది.. నువ్వు ఇక్కడ లవ్ కంటెంట్ కోసం వచ్చావ్.. అంటూ మరోసారి రీతూని కెలికింది అయేషా. దాంతో ఎవరు లవ్ కంటెంట్ కోసం వచ్చారు..? అని రీతూ సీరియస్ అవ్వడంతో.. అయేషా కూడా రెచ్చిపోయింది. హే ఎందుకంత ఆటిట్యూడే నీకు. ఇక్కడ ఉండే అర్హత లేదు..  అని అయేషా అంటే..నువ్వే చెప్పావ్ కదా నన్ను కంటెండర్‌గా ఎందుకు తీసుకోవట్లేదంటే నేను స్ట్రాంగ్ నువ్వు ఏమన్నా అనుకో అన్నావ్ కదా.. అని స్ట్రాంగ్ రిప్లే ఇచ్చింది. స్ట్రాంగ్ అని నేను ఎప్పుడు చెప్పాను.. నీ ఆరోగెన్సీ నీ గేమ్ స్ట్రాటజీ నాకు నచ్చలేదని చెప్పాను.. అని యూ టర్న్ తీసుకుంది అయేషా.

ఆ తర్వాత తనకు ఛాన్స్ రాగానే రీతూ వచ్చి అయేషాని ముందుగా నామినేట్ చేసింది.  రీతూ మాట్లాడుతూ..  ఫస్ట్ నువ్వు ఎవరు ఏం మాట్లాడుతున్నారో పూర్తిగా విను.. ఆ తర్వాత డిసైడ్ అయి మాట్లాడు.. నీకు అది లేదు.. అంది రీతూ.  నీ ఇష్టమొచ్చినట్లు మాటలు అనేస్తావ్.. ఎదుటివాళ్లు మాట్లాడుతుంటే వినకుండా వెళ్లిపోతావ్.. నువ్వు ఎదుటివ్యక్తిని దేని గురించి అంటావో అది నువ్వే బిహేవ్ చేస్తావ్.. ఎదుటివాళ్ల ఆటిట్యూడ్ గురించి మాట్లాడేముందు మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, మనం ఎలా లుక్కులు ఇస్తున్నాం, ఓవరాక్షన్ చేస్తున్నాం అనేది చూసుకో.. నువ్వు కూడా ఐదు వారాలు గేమ్ చూసొచ్చి ఎవరితో ఉంటే మనకి ప్లస్ అవుతుంది.. అని ప్లాన్ చేసి వాళ్లతోనే ఉంటున్నావ్.. ఇక్కడ ఎవడూ లవ్ ట్రాక్‌లు పెట్టుకోవడానికి రారు. వచ్చాక కనెక్షన్ ఫామ్ అయితే ఉంటారు అంతే.. అని చెప్పుకొచ్చింది రీతూ.. దానికి వెటకారంగా నవ్వింది అయేషా. దాంతో రీతూకి మరింత కాలింది. అలాగే ఇంకొక వారం ఉంది కదా చూడు గేమ్.. అంటూ అయేషా రీతూని రెచ్చగొట్టింది. ఎప్పుడూ ఎక్కడ గొడవపెట్టుకుందామా అని చూస్తావ్.. గిన్నెల దగ్గర గొడవ పెట్టుకుందామా.. అక్కడ గొడవ పెట్టుకుందామా అని చూస్తావ్.. అని రీతూ అంటే.. దానికి నీ లాగ సేఫ్‌గా ఆడి లవ్ కంటెంట్ ఇవ్వడానికి నేను రాలేదు..అని అయేషా మరోసారి అదే పాయింట్ లేపింది. దాంతో రీతూ కూడా రెచ్చిపోయింది. నోరు మూసుకునే ఉండు.. అని రీతూ.. ఏయ్ నువ్వెవరివే.. అంటూ అయేషా అరుస్తూ రీతూ మీదకు వెళ్ళింది. ఏయ్ ఇలాంటి వేషాలు నా దగ్గర వద్దు.. నోరు మూసుకో ఎలా చెప్తావే నాకు.. అంటూ అయేషా రెచ్చిపోయింది. ఇలా ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..