AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతనితో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్న సామ్.. ఫిక్స్ అంటున్న అభిమానులు

స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలే నిర్మాతగా మారింది. రీసెంట్ గానే శుభం అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఏలింది సమంత.. ఏ స్టార్ హీరో సినిమా చూసినా హీరోయిన్ గా సమంతానే ఉండేది. అయితే గతకొంతకాలంగా సమంత సినిమాలు చేయడం లేదు.

అతనితో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్న సామ్.. ఫిక్స్ అంటున్న అభిమానులు
Samantha
Rajeev Rayala
|

Updated on: Oct 21, 2025 | 8:44 AM

Share

దీపావళి పండగను దేశమంతా ఎంతో ఘనంగా జరుపుకున్నారు. వెలుగులతో, టపాకాయలతో కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా జరుపుకున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా దీపావళి పండగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే సినీ తారల దీపావళి సెలబ్రేషన్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే స్టార్ హీరోయిన్ సమంత పంచుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. దర్శకుడు రాజ్ తో కలిసి సమంత దీపావళి పండగను జరుపుకున్నారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల పై అభిమానులు  రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా సమంత రాజ్ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

సమంత ఇటీవలే నిర్మాతగా మారింది. రీసెంట్ గానే శుభం అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఏలింది సమంత.. ఏ స్టార్ హీరో సినిమా చూసినా హీరోయిన్ గా సమంతానే ఉండేది. అయితే గతకొంతకాలంగా సమంత సినిమాలు చేయడం లేదు. మొన్నటివరకు మాయోసైటిస్ తో బాధపడిన సమంత ఇప్పుడు తిరిగి సినిమాల్లో రాణిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ మధ్య సమంత మరోసారి రిలేషన్ లో ఉంది అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. త్వరలో సమంత పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తుందని కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో రాజ్ నిడిమోరు పాపులర్ అయ్యారు. ఈ మధ్యకాలంలో సమంత, రాజ్ నిడిమోరు కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇప్పుడు దీవాళీ సెలబ్రేషన్ ఫోటోలు వైరల్ అవ్వడంతో సామ్, రాజ్ రిలేషన్ పై అభిమానుల అనుమానాలకు మరింత బలం చేకూరింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ చిన్న మార్పులు చేయండి..
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ చిన్న మార్పులు చేయండి..
సినిమాల్లోకి రాఘవ లారెన్స్ కూతురు..
సినిమాల్లోకి రాఘవ లారెన్స్ కూతురు..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్! వైద్యుల ఆందోళనకు కారణమేంటి?
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్! వైద్యుల ఆందోళనకు కారణమేంటి?
బ్యాచ్‌లర్స్... తగినంత సమయం లేనప్పుడు ఇలా చికెన్ కర్రీ చేసుకోండి
బ్యాచ్‌లర్స్... తగినంత సమయం లేనప్పుడు ఇలా చికెన్ కర్రీ చేసుకోండి
సింగిల్ టేక్‌లో రామ్ చరణ్ సిగ్నేచర్ స్టెప్పులతో ఇరగదీసిన ఫ్యాన్
సింగిల్ టేక్‌లో రామ్ చరణ్ సిగ్నేచర్ స్టెప్పులతో ఇరగదీసిన ఫ్యాన్
షుగర్ పేషెంట్స్ ఈ ఫుడ్ తీసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి!
షుగర్ పేషెంట్స్ ఈ ఫుడ్ తీసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి!
ఏ పని చేపట్టినా పదే పదే ఆటంకాలు ఎదురవుతున్నాయా?
ఏ పని చేపట్టినా పదే పదే ఆటంకాలు ఎదురవుతున్నాయా?
పాములు నిద్రిస్తున్నప్పుడు కళ్లు ఎందుకు తెరిచి ఉంచుతాయంటే?
పాములు నిద్రిస్తున్నప్పుడు కళ్లు ఎందుకు తెరిచి ఉంచుతాయంటే?
ఇది పక్షి కాదు.. ప్రకృతి శాస్త్రవేత్త! గుడ్ల ఆధారంగానే వర్షాలు!!
ఇది పక్షి కాదు.. ప్రకృతి శాస్త్రవేత్త! గుడ్ల ఆధారంగానే వర్షాలు!!
ఘాటైన మసాలాలతో నోరూరించే మటన్ తలకాయ కూర.. తయారీ విధానం ఇదే!
ఘాటైన మసాలాలతో నోరూరించే మటన్ తలకాయ కూర.. తయారీ విధానం ఇదే!