
బిగ్‌బాస్ హౌస్‌లో 9వ వారం నామినేషన్స్‌లో రచ్చ కంటిన్యూ అవుతుంది. హౌస్ మేట్స్ ఒకరి మీద ఒకరు నామినేషన్స్ వేస్తూ వాదనలు, గొడవలు పెట్టుకుంటున్నారు. ఆదివారం రోజున దివ్వెల మాధురి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన విషయం తెల్సిందే. ఊహించని విధంగా హౌస్ నుంచి మాధురి హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. 9వ వారం నామినేషన్స్‌లో మొత్తం ఏడుగురు ఉన్నారు. నిన్నటి నామినేషన్స్ లో ముందుగా బొమ్మల 5టాస్క్ పెట్టారు. గార్డెన్ ఏరియాలో కొన్ని బొమ్మలు పెట్టి ఆ బొమ్మలకు హౌస్ లో ఉన్నవారి ఫోటోలు ఉంచాడు. హౌస్ మేట్స్ వారికి నచ్చిన బొమ్మ తీసుకొని ముందుగా సేఫ్ జోన్ లోకి వెళ్ళాలి.. కాగా ఆకారిగా ఎవరు చేరుకుంటారో.. వారి చేతిలో ఎవరి బొమ్మ ఉంటుందో వారు నామినేషన్ లోకి వస్తారు అని చెప్పాడు బిగ్ బాస్.
ముందుగా సంజన ఆఖరిలో ఊడిపోయింది. దాంతో ఆమె రీతూ గురించి చెప్పింది. మొదటి నుంచి నేను ఒంటరిగానే గేమ్ ఆడుతున్నా.. కానీ రీతూ గేమ్ లో ఎక్కడో డిమాన్ పవన్ కంట్రిబ్యూషన్ కనిపిస్తుంది అని తన పాయింట్ చెప్పింది. దాంతో రీతూ కూడా వాదించింది. ఆతర్వాత తనూజాకు సంజనకు మధ్య వాదన జరిగింది. అలాగే తనూజాకు దివ్యకు మధ్య కూడా చిన్న వాదన జరిగింది. ఆతర్వాత సుమన్ శెట్టి ఆఖరిలో మిగిలిపోవడంతో అతని దగ్గర తనూజ బొమ్మే ఉండటంతో.. నా ఫాల్ట్ కాబట్టి నేను నెమ్మదిగా వెళ్ళాను కాబట్టి తనుజను నామినేట్ చేయాలి అని నేను అనుకోవడం లేదు.. నాకు నేనే నామినేట్ చేసుకుంటున్నా అన్నాడు సుమన్.
నామినేషన్ ఇలా అయిందో లేదో కిచెన్ దగ్గరికెళ్లి సంజన ఏడుపు అందుకుంది. నాకోసం జుట్టు కత్తిరించుకుంది. ఆమెతోనే నేను గొడవపడాల్సి వచ్చింది అంటూ బోరుమంది సంజన. దాంతో అందరూ వచ్చి ఆమెను ఓదార్చారు. సంజన మాత్రం చాలా సేపు ఏడూస్తూనే ఉంది. ఆతర్వాత ఏమైందో ఏమో కానీ బిగ్ బాస్ రూల్స్ మార్చేశారు. ఈసారి ముందుగా ఎవరు సేఫ్ జోన్ లోకి వెళ్తారో వారు తమ దగ్గర ఉన్న బొమ్మ మీది హౌస్ మేట్ ఇద్దరూ కలిసి ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. వారిలో ఒకరు డైరెక్ట్ నామినేట్ అవుతారు అని చెప్పాడు. చివరిగా వచ్చిన సాయి.. తనూజని నామినేట్ చేశాడు. భరణి-తనూజ ఇద్దరూ వచ్చి తమలో ఎవరు హౌస్‌లో ఉండేదుకు ఎక్కువ అర్హులో వాదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత దివ్య అనూహ్యంగా భరణిని నామినేట్ చేసి షాకిచ్చింది. తనూజకి ఛాన్స్ రావడంతో ఇమ్మానుయేల్‌ని నామినేట్ చేసింది. దానికి ఇమ్మూ గట్టిగానే ఇచ్చి పడేశాడు. రాము.. కళ్యాణ్‌ని నామినేట్ చేశాడు. చివరికి సంచాలక్‌గా ఉన్న డీమాన్.. ఇమ్మూని సేవ్ చేసి కళ్యాణ్‌ని నామినేట్ చేశాడు. ఆతర్వాత ఇమ్మూకి ఛాన్స్ రావడంతో తనూజని నామినేట్ చేశాడు. రీతూ రాముని నామినేట్ చేసింది. కళ్యాణ్.. రాముని నామినేట్ చేశాడు. ఆ తర్వాత రౌండ్‌లో ఇమ్మూ సాయిని నామినేట్ చేయగా నిఖిల్.. తనూజని నామినేట్ చేశాడు. నిఖిల్.. తనూజ మధ్య పెద్ద వాదనే జరిగింది. సంచాలక్ డీమాన్.. సాయిని నామినేట్ చేసి తనూజని సేవ్ చేశాడు. ఫైనల్ గా కెప్టెన్ దివ్యకి స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఆమె ఒకరిని డైరెక్ట్ గా నామినేట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు.. తనూజని నేరుగా నామినేట్ చేసింది దివ్య.. దాంతో ఒక్కసారిగా తనూజ దివ్య పై ఎటాక్ చేసింది. దివ్య కూడా ఎక్కడా తగ్గకుండా.. సీరియస్ కౌంటర్లు వేసింది. ఫైనల్ గా ఈ వారం నామినేషన్స్ లో సంజన, సుమన్ శెట్టి, భరణి, కళ్యాణ్, రాము, సాయి, తనూజ ఉన్నారు.