Bigg Boss 8 Telugu : నా బాయ్ ఫ్రెండ్ కు నాకు చాలా గొడవలు జరిగాయి.. ఏడ్చేసిన నైనికా

|

Sep 14, 2024 | 9:58 AM

హౌస్ లో ఉన్న వారిలో ఇద్దరినీ పిలిచి వారికి హౌస్ నుంచి వచ్చిన గిఫ్ట్స్ చూపించి. మిగిలిన వారికి లాలీపప్స్ ఇచ్చి అవి ఆ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఇవ్వాలని చెప్పాడు బిగ్ బాస్ ముందుగా అభయ్, నిఖిల్ కు గిఫ్ట్ ఇచ్చాడు. అభయ్ వాళ్ళ నాన్న వాచ్, అలాగే నిఖిల్ ఫాదర్ షర్ట్ హౌస్ లోకి తీసుకు వచ్చాడు.

Bigg Boss 8 Telugu : నా బాయ్ ఫ్రెండ్ కు నాకు చాలా గొడవలు జరిగాయి.. ఏడ్చేసిన నైనికా
Bigg Boss 8
Follow us on

బిగ్ బాస్ సీజన్ 8 నిన్నటి ఎపిసోడ్ లో నవ్వులు, ఏడుపులతో రచ్చ రచ్చ గా సాగింది. ఐదుగురు హౌస్ మేట్స్ ఇంటి దగ్గర నుంచి గిఫ్ట్స్ పంపించాడు బిగ్ బాస్. హౌస్ లో ఉన్న వారిలో ఇద్దరినీ పిలిచి వారికి హౌస్ నుంచి వచ్చిన గిఫ్ట్స్ చూపించి. మిగిలిన వారికి లాలీపప్స్ ఇచ్చి అవి ఆ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఇవ్వాలని చెప్పాడు బిగ్ బాస్ ముందుగా అభయ్, నిఖిల్ కు గిఫ్ట్ ఇచ్చాడు. అభయ్ వాళ్ళ నాన్న వాచ్, అలాగే నిఖిల్ ఫాదర్ షర్ట్ హౌస్ లోకి తీసుకు వచ్చాడు. ఇక మిగిలిన హౌస్ మేట్స్ అభయ్‌కు లాలీ పప్స్ ఇచ్చారు. ఇక ఆతర్వాత నైనికా, సీతకి సంబంధించిన గిఫ్ట్‌లు వచ్చాయి. గిఫ్ట్స్ చూడగానే సీత బోరున ఏడ్చేసింది. తనకు వచ్చిన బొమ్మను చూసి సోనియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది సీత.

5 ఇయర్స్ ఒక రిలేషన్‌లో ఉన్న తర్వాత తను నన్ను వదిలి వెళ్లిపోయాడు.. అప్పుడు ఒక ఫ్రెండ్ కలిశాడు.. అతను ఇచ్చిన గిఫ్ట్‌యే ఇది.. అది లేకుండా ఏడాదిన్నర నుంచి నిద్ర పోలేదు.. అయితే ఇక్కడికి వచ్చాక నాకు నైనిక, విష్ణు దొరికారు లక్కీగా.. వాళ్లతో మాట్లాడతూ పడుకుంటున్నా.. కనుక ఇది లేకపోయినా ఫర్లేదు.. నైనికకి వచ్చిన గిఫ్ట్ తనకి ఇవ్వడమే నాకు ఇష్టం అని చెప్పింది సీత.

ఇక్కడికి వచ్చే 20 రోజుల ముందు కూడా నా బాయ్ ఫ్రెండ్ కు నాకు చాలా గొడవలు జరిగాయి.. ఇద్దరం వద్దనుకున్నాం కానీ తను, నేనూ ఇద్దరూ వదల్లేకపోయాం. నా అబ్యూజివ్ రిలేషన్ షిప్ తర్వాత హైదరాబాద్‌లో నేను ఒక పర్సన్ వల్ల హీల్ అయ్యానంటే అది తన వల్లే.. నేను కొన్ని తప్పులు చేశాను.. కానీ నువ్వు నన్ను లవ్ చేసినదానికి లవ్ యూ సో మచ్ కన్నా..” అంటూ నైనిక కన్నీళ్లు పెట్టుకుంది. ఆతర్వాత నైనికకి గిఫ్ట్ ఇచ్చేసింది సీత. ఆ తర్వాత నబీల్, పృథ్వీ ఫోటో ఫ్రెమ్స్ వచ్చాయి. పృథ్వీ తన తండ్రి చిన్నప్పుడు తనను ఎత్తుకున్న ఫోటో చూసి ఎమోషనల్ అయ్యాడు. నా లైఫ్ లో 30 రోజులే గడిపాను.. ఎందుకంటే ఆయనకు కోపం ఎక్కువ.. ఆ కోపమే నాకు వచ్చింది. నాకు ఆ ఫోటో వొద్దు నబ్బెల్ కు ఇచ్చేయండి అని చెప్పాడు. ఇక నబీల్ తన తండ్రి లాస్ట్ ఫోటో అదే ఆయన కరోనా సమయంలో చనిపోయారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.