Bigg Boss 8: “నేను హౌస్ నుంచి వెళ్ళిపోతా”.. స్ట్రాంగ్ క్యాండెట్ అనుకుంటే ఇలా అయిపోయాడేంటి..!

|

Sep 11, 2024 | 8:41 AM

మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ బాషా, నైనిక, విష్ణుప్రియ ఈవారం నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఈసారి హౌస్‌లోకి వచ్చిన వారిలో నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. మొదట్లో హౌస్ లో కెప్టెన్ లా బిహేవ్ చేసిన నిఖిల్.. ఇప్పుడు బ్యాలన్స్ తప్పాడు..

Bigg Boss 8: నేను హౌస్ నుంచి వెళ్ళిపోతా.. స్ట్రాంగ్ క్యాండెట్ అనుకుంటే ఇలా అయిపోయాడేంటి..!
Nikhil
Follow us on

బిగ్ బాస్ హౌస్ లో రోజు రోజుకు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది. రెండో వారం కూడా నామినేషన్స్ వాడివేడిగా జరిగాయి. ఈవారం ఏకంగా నామినేషన్స్ లో ఏకంగా ఎనిమిదిమంది ఉన్నారు. మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ బాషా, నైనిక, విష్ణుప్రియ ఈవారం నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఈసారి హౌస్‌లోకి వచ్చిన వారిలో నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. మొదట్లో హౌస్ లో కెప్టెన్ లా బిహేవ్ చేసిన నిఖిల్.. ఇప్పుడు బ్యాలన్స్ తప్పాడు.. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ నుంచి క్విట్ అవుతా అంటూ ఎమోషనల్ అయ్యాడు. నామినేషన్స్ లోనూ అంతగా పాయింట్స్ కరెక్ట్ గా మాట్లాలేకపోయాడు నిఖిల్. ప్రేరణ నామినేట్ చేసే సమయంలోనూ సరైన రీజన్ చెప్పలేకపోయాడు. పృథ్వీకి నామినేషన్ వేస్తూ.. ఎవరికి వెయ్యాలో తెలియక నీకు వేస్తున్నా అంటూ చెత్త రీజన్ చెప్పాడు నిఖిల్.

ఇది కూడా చదవండి :మొగుడు ముసలోడు.. యవ్వారానికి మరొకడు.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న సినిమా..

దానికి పృథ్వీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. అర్థం చేసుకుంటాడనే పృథ్వీ వేశాను.. వాడంత ఫీలవుతాడనుకుంటే వేసేవాడినే కాదు.. ఈ గేమ్ ఎక్కువేం కాదు నాకు.. మరీ అంత దిగజారి ఆడాలా.. నాకు అర్థం కావడం లేదు.. అని సోనియాతో అన్నాడు నిఖిల్. ఆతర్వాత అర్ధరాత్రి సమయంలో మణికంఠ, నైనిక దగ్గర నిఖిల్ మాట్లాడుతూ.. నాకు ఎలిమినేషన్ వస్తుంది అన్నా నేను పట్టించుకోను.. ఎందుకంటే నేను గేమ్ కోసం మారలేను.. ఎన్ని ఎదో చెప్పుకున్నాడు.

ఇది కూడా చదవండి : Chiranjeevi : మెగాస్టార్‌తో ఉన్న ఇతన్ని గుర్తుపట్టారా.? ఇండస్ట్రీనే ఊపేశాడు అతను

పిచ్చిలేసిందా మీ ఇద్దరినీ టాప్ 10లో చూస్తున్నా నేను.. అని మణికంఠ అన్నాడు. “నిఖిల్ అనే క్యారెక్టర్ ఇలా అని తెలిసినోడు ఎవడూ.. వీడు గేమ్ షో కోసం ఫేక్ చేశాడని అనుకోకూడదు.. అలా అనుకునే పరిస్థితి వచ్చేదానికన్నా ఎలిమినేట్ అయిపోవడమే కరెక్ట్.. అసలు నాకు షో నుంచి క్విట్ చేయాలనే థాట్ ఉంది.. కానీ నేను నా క్యారెక్టర్ చంపుకోకుండా ఏం చేయాగలను, ఎంత వరకూ చేయగలను అనేది చూద్దామనే ఉన్నా” అని నిఖిల్ డైలాగ్ కొట్టాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.