నాకు చాలా సార్లు పెళ్లి చేశారు.. ఈ క్రేజీ బ్యూటీ అంతమాట అనేసిందేంటీ..!!

కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అభిమన్యు అనే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది ఈ అమ్మడు. ఆ తర్వాత తిరిగి తెలుగులో నటించలేదు. తమిళ్ లో కొన్ని సినిమాలు చేసిన రమ్య ఎక్కువగా కన్నడ బాషలోనే సినిమాలు చేసింది. 2016 తర్వాత ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంటుంది.

నాకు చాలా సార్లు పెళ్లి చేశారు.. ఈ క్రేజీ బ్యూటీ అంతమాట అనేసిందేంటీ..!!
Actress Ramya
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 11, 2024 | 8:17 AM

సినిమా హీరోయిన్స్ పెళ్లిళ్ల గురిని నిత్యం రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అలాగే ఇప్పుడు ఓ బ్యూటీకి సంబందించిన పెళ్లి వార్త వైరల్ గా మారింది. ఆ అమ్మడు ఎవరో కాదు క్రేజీ బ్యూటీ రమ్య. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అభిమన్యు అనే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది ఈ అమ్మడు. ఆ తర్వాత తిరిగి తెలుగులో నటించలేదు. తమిళ్ లో కొన్ని సినిమాలు చేసిన రమ్య ఎక్కువగా కన్నడ బాషలోనే సినిమాలు చేసింది. 2016 తర్వాత ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంటుంది. రమ్య నటనకు దూరంగా ఉన్నా.. ఆమెపై వార్తలు మాత్రం తగ్గలేదు. ఆమెకు సంబందించిన ఎదో ఒక  గాసిప్ స్ప్రెడ్ అవుతూనే ఉంది. తాజాగా రమ్య పెళ్లి గురించి మీడియాలో వార్తలు వచ్చాయి.

రమ్యకు త్వరలోనే ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఆ వార్తల పై రమ్య స్వయంగా స్పందించింది. తన పెళ్లిపై వస్తున్న వార్తలు అవాస్తవమని ఆమె చెప్పుకొచ్చింది. రమ్య వ్యక్తిగత జీవితం గురించి, ముఖ్యంగా ఆమె పెళ్లి గురించి పుకార్లు రావడం ఇదే మొదటిసారి కాదు. దాని గురించి తరచుగా గాసిప్‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈసారి ఇతనే వరుడు అంటూ ఓ వ్యక్తి ఫొటో కూడా వైరల్ గా మారింది.

త్వరలో నిశ్చితార్థం, ఆతర్వాత పెళ్లి అంటూ పుకార్లు వచ్చాయి. అయితే అదంతా అబద్ధమని రమ్య చెప్పింది. పెళ్లి గురించిన పుకార్లు రమ్య చెవిన పడ్డాయి అంటూ సోషల్ మీడియా లో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఈ విషయాన్ని రమ్య ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలిపింది. ‘మీడియా వ్యక్తులు నాకు చాలాసార్లు పెళ్లి చేసేశారు. ఎన్నిసార్లు చెప్పాలో నాకు తెలియడం లేదు. ఒకవేళ పెళ్లి అయితే మీకు తెలియజేస్తాను. దయచేసి ఇలాను పిచ్చి వార్తలు , పుకార్లు వ్యాప్తి చేయడం ఆపండి’ అని రమ్య రాసుకొచ్చింది. ప్రస్తుతం రమ్య ఏ సినిమాలోనూ నటించడం లేదు. అయితే త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వడానికి రమ్య రెడీగా ఉందని తెలుస్తోంది.

Ramya

Ramya

రమ్య ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.