Nainika: అందుకే అతనితో విడిపోయా.. అసలు విషయం చెప్పిన బిగ్ బాస్ నైనికా

|

Oct 26, 2024 | 8:26 PM

బిగ్ బాస్ సీజన్ 8ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది అందాల భామ నైనికా.. ఢీ షో ద్వారా పాపులర్ అయిన ఈ భామ.. బిగ్ బాస్ సీజన్ 8లో అవకాశం అందుకుంది. తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది.

Nainika: అందుకే అతనితో విడిపోయా.. అసలు విషయం చెప్పిన బిగ్ బాస్ నైనికా
Nainika
Follow us on

బిగ్ బాస్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న భామల్లో నైనికా ఒకరు. అంతకంటే ముందు డాన్సర్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ భామ. ప్రముఖ డాన్స్ షో ఢీ ద్వారా ఈ చిన్నది బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయింది. డాన్స్ లో అదరగొట్టే నైనికా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది నైనికా.. కాగా ఈ చిన్నది రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 8 లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. తన అందంతో పాటు ఆటతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఎక్కువ వారాలు హౌస్ లో ఉండలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. స్టార్టింగ్ లో బిగ్ బాస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపించిన నైనికా.. ఆ తర్వాత అంతగా పర్ఫామ్ చేయలేకపోయింది. 35వ రోజున హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకి వచ్చింది.

ఇది కూడా చదవండి : Amrish Puri: అమ్రీష్ పురి మనవడు ఇండస్ట్రీలో స్టార్ హీరో అని మీకు తెలుసా.?

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ చిన్నది ఎక్కువగా సోషల్ మీడియాతోనే టైం పాస్ చేస్తోంది. అలాగే పలు ఇంటర్వ్యూలోనూ పాల్గొంటుంది నైనికా.. గతంలో ఓ ఇంటర్వ్యూలో నైనికా తన కెరీర్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి  ఆసక్తికర విషయాలు పంచుకుంది. నైనికాకు బాయ్ ఫ్రెండ్ ఉన్న విషయం తెలిసిందే. అతను కూడా డాన్సరే..

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Mokshagna : ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..! మోక్షజ్ఞకు జోడీగా స్టార్ హీరోయిన్ కూతురు..

నైనికా తల్లి తండ్రి తన చిన్న తనంలోనే విడిపోయారు. నాకు తెలిసి మా నాన్న ఎప్పుడూ మా అమ్మను కొడుతూ, తిడుతూ ఉండేవాడు.. నేనే నాన్నను దూరం పెట్టాను అని గతంలో తెలిపింది నైనికా. అలాగే అమ్మ, మావయ్య నన్ను పెంచి పోషించారు చెప్పుకొచ్చింది. అలాగే తన ప్రేమ , బ్రేకప్ గురించి కూడా తెలిపింది. ఢీ షో సమయంలో తన కో డాన్సర్ సాయితో ప్రేమలో పడింది. ఈ ఇద్దరూ కలిస్ చాలా సాంగ్స్ కు డాన్స్ చేశారు కూడా.. ఆతర్వాత ఏమైందో ఏమో కానీ ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. దీని గురించి కూడా నైనికా మాట్లాడింది. బ్రేకప్ ఎఫెక్ట్ నుంచి బయటకి రావడానికి నాకు చాలా టైం పట్టింది అని తెలిపింది. మా ఇద్దరి థింకింగ్స్ వేరు. నన్ను ప్రేమించే వాడు నాతో పాటు మా అమ్మని కూడా గౌరవించాలి అనుకున్నా.. అతను మంచివాడే.. కానీ మా ఇద్దరికి సెట్ అయ్యేది కాదు అని తెలిపింది. కొంతమంది అబ్బాయిలా మెంటాలిటీ చాలా వేరుగా ఉంటుంది. అమ్మాయిలను ఇప్పటికీ చులకనగా చూస్తున్నారు. తాను ప్రేమించే అమ్మాయి తనకన్నా తక్కువ అని అనుకుంటారు. ఆ అమ్మాయికి గౌరవం కూడా ఇవ్వరూ.. అలాంటి వాళ్లు నాకు సెట్ అవ్వరు. అతను ఎంత మంచి వాడు అయినా నాకు సెట్ అవ్వడు అందుకే బ్రేకప్ చెప్పుకున్నాం అని తెలిపింది నైనికా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.