Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: ‘బయటకు రావడానికి అతడే కారణం.. ఆ మాటలు బాధపెట్టాయి’.. రతిక ఎమోషనల్..

ఎలిమినేషన్ తర్వాత బిగ్‏బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంది రతిక. అయితే ఆమె రావడంతోనే ఒక ప్రామిస్ తీసుకుంది గీతూ. ఏ క్వశ్చన్ అడిగినా నిజాలే చెబుతాను.. తెలిదు.. గుర్తులేదు.. మర్చిపోయాను అని మాత్రం చెప్పనంటూ ప్రామిస్ చేయాలని కోరింది. దీంతో ప్రామిస్ చేసింది రతిక. ఇన్ని రోజులు గేమ్ ఆడకుండా నెట్టుకొచ్చావ్ ఎలా అనిపిస్తుందంటూ అడిగేసింది. ఆడలేదని నిజం ఒప్పుకుంది రతిక. ఆతర్వాత రతిక 1.0.. రతిక 2.0 కి తేడా ఏంటీ అని అడగ్గా.

Bigg Boss 7 Telugu: 'బయటకు రావడానికి అతడే కారణం.. ఆ మాటలు బాధపెట్టాయి'.. రతిక ఎమోషనల్..
Rathika
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 27, 2023 | 1:54 PM

బిగ్‏బాస్ సీజన్ 7లో రెండో అవకాశం వరించింది కేవలం రతికను మాత్రమే. మొదట మంచి పాజిటివిటితో హౌస్ లోకి అడుగుపెట్టిన రతిక.. ఆ తర్వాత తన ఆట తీరుతో జన్నాల్లో పూర్తిగా నెగిటివ్ అయ్యింది. దీంతో నాలుగు వారాలకే ఎలిమినేట్ అయ్యింది. కానీ ఆ తర్వాత ఉల్టా పుల్టా సీజన్ కావడంతో తిరిగి రతికకు రెండోఛాన్స్ ఇచ్చారు. అయితే ఈసారి కూడా రతికకు పాజిటివిటి మాత్రం రాలేదు. వెళ్లగానే టాస్కులలో రతిక నుంచి ఎలాంటి పర్ఫెమెన్స్ లేకపోవడం.. తిరిగి ప్రశాంత్ తో గొడవ పెట్టుకోవడం ఆమెకు మైనస్ అయ్యాయి. అంతేకాకుండా శివాజీ ఇచ్చిన సూచనలతో అతడికే చుక్కలు చూపించింది. టెడ్డీ టాస్కులో అమర్ ను బతిమాలడం.. ఆ వెంటనే కెప్టెన్సీ టాస్కులో అతడిని టార్గెట్ చేయడంతో ఆమెకు మరింత నెగిటివ్ అయ్యాయి. దీంతో అంతా ఊహించినట్లే పన్నెండో వారం రతిక ఎలిమినేట్ అయ్యింది. అయితే తన కోసం ఎవిక్షన్ పాస్ ఉపయోగించాలని ప్రశాంత్ ను బతిమాలింది. కానీ ఆమెకు నిరాశే ఎదురయ్యింది. అటు శివాజీ సైతం ఎవిక్షన్ పాస్ విషయంలో హెల్ప్ చేయకపోవడంతో రతిక బయటకు రావాల్సి వచ్చింది.

ఎలిమినేషన్ తర్వాత బిగ్‏బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంది రతిక. అయితే ఆమె రావడంతోనే ఒక ప్రామిస్ తీసుకుంది గీతూ. ఏ క్వశ్చన్ అడిగినా నిజాలే చెబుతాను.. తెలిదు.. గుర్తులేదు.. మర్చిపోయాను అని మాత్రం చెప్పనంటూ ప్రామిస్ చేయాలని కోరింది. దీంతో ప్రామిస్ చేసింది రతిక. ఇన్ని రోజులు గేమ్ ఆడకుండా నెట్టుకొచ్చావ్ ఎలా అనిపిస్తుందంటూ అడిగేసింది. ఆడలేదని నిజం ఒప్పుకుంది రతిక. ఆతర్వాత రతిక 1.0.. రతిక 2.0 కి తేడా ఏంటీ అని అడగ్గా.. ఆ ఎఫర్ట్ కూడా పెట్టలేదనిపిస్తుందని చెప్పింది రతిక. దీంతో మరీ ఎందుకు వెళ్లావ్ అంటూ గీతూ అడిగేసింది.

ఇక తర్వాత రతిక ఒక గోడమీద పిల్లిలాగ అనిపించింది. ఒకసారి SPA బ్యాచ్ తో.. మరికొన్నిసార్లు SPY బ్యాచ్ తో ఉంది. నామినేషన్స్ లోకి రాకుండా మ్యానేజ్ చేసినట్లు అనిపిస్తుందని అడిగేసింది గీతు. ఆ తర్వాత హౌస్ లో డిసర్వ్ ఇనిపిస్తుందని అడగ్గా.. యావర్ ఫోటో చింపి చెత్తకుండిలో వేసింది రతిక. ఆ తర్వాత గౌతమ్ ఫోటోను చింపుతూ.. ఒక మనిషికి కావాలని రెచ్చగొడుతున్నాడని తెలిపింది. తను బయటకు రావడానికి కారణం అమర్ అంటూ చెప్పేసింది. తనపై జరిగిన ట్రోలింగ్, రాధిక అక్కా అని పిలవడం గుర్తొచ్చి మానసికంగా డిప్రెషన్ అయ్యాయని.. వెళ్లగానే భోలే ఏదో పాటలు పాడడం.. ఎమోషనల్ గా క్రియేట్ చేయడంతో.. చాలా డిస్టర్బెన్స్ అయ్యాయని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది రతిక.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.