
నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ కంటెండర్ కోసం హౌస్ మేట్స్ పోటీ పడ్డారు. హౌస్ లో ఉన్న వారిని రెండు టీమ్స్ గా డివైడ్ చేసి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. వీరసింహాలు, గర్జించే పులులు అంటూ రెండు టీమ్స్ చేశాడు. ఈ టీమ్స్ లో అర్జున్, ప్రశాంత్, శివాజీ, అమర్, ప్రియాంక, అశ్విని.. గర్జించే పులుల . అలాగే యావర్, గౌతమ్, భోలే, తేజ, శోభా, రతిక వీరసింహాలు టీమ్ లో ఉన్నారు. ఇక హాల్ ఆఫ్ బాల్ అనే టాస్క్ ఆడించాడు బిగ్ బాస్. పైప్ నుంచి వచ్చే చిన్న చిన్న బాల్స్ ను తమకు ఇచ్చిన సంచుల్లో నింపుకోవాలని.. వాటిని దుస్తుల్లో, బ్యాగ్స్ లో , సూట్ కేసుల్లో దాచకూడదు అని చెప్పాడు బిగ్ బాస్. ఈ టాస్క్మధ్యలోనే మరో గేమ్ ఆడించారు. రెండు టీమ్స్ నుంచి ఇద్దరు హౌస్ మేట్స్ తో ఓ గేమ్ ఆడించాడు బిగ్ బాస్.
ఈ గేమ్ లో ఒకరు బెలూన్ ఊదితే మరొకరు ఆ బెలూన్ ను అక్కడే ఉన్నటైర్స్ లో ఫిట్ చేయాలి . ఈ గేమ్ కో వీరసింహాలు నుంచి యావర్, తేజ.. అలాగే గర్జించే పులులు నుంచి ప్రశాంత్, అర్జున్ వచ్చారు. ఈ గేమ్ లో ఎవరు విన్ అయితే వారికి పవర్ బాక్స్ నుంచి ఒక పవర్ వస్తుందని తెలిపారు. దాంతో రెండు టీమ్స్ పోటాపోటీగా ఆడారు.
అయితే ఈ గేమ్ లో వీరసింహాలు విన్ అయ్యారు. దాంతో వారికి ఒక పవర్ వచ్చింది. ఆ పవర్ ఏంటంటే అపోజిట్ టీమ్ నుంచి ఒకరిని తప్పించాలి. దాంతో గేమ్ నుంచి తీసేసిన వారు ఎలాంటి టాస్క్ లు , స్ట్రాటజీలు ఆడకూడదు. దాంతో వీరసింహాలు టీమ్ తెగ చేర్చించారు. తేజ గర్జించే పులులు టీమ్ లో ఇద్దరు నామినేషన్స్ లో లేరు, కాబట్టి వారిలో ఒకరికి డెడ్ బోర్డు వేద్దాం అన్నాడు. కానీ అందుకు అందరూ ఒప్పుకోలేదు. ఇక ఆ టీమ్ లో అర్జున్, ప్రశాంత్ స్ట్రాంగ్ ప్లేయర్స్ కాబట్టి వారిలో ఒకరికి వేద్దాం అన్నినిర్ణయించుకున్నారు. అర్జున్ ఎలాగో నామినేషన్స్ లో ఉన్నాడు కాబట్టి ప్రశాంత్ కు బోర్డు వేశారు. దాంతో ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అందుకే మేము బయపడి నీకు బోర్డు వేస్తున్నాం అని శోభా ప్రశాంత్ ను ఓదార్చింది. శివాజీ కూడా ప్రశాంత్ కు ధైర్యం చెప్పాడు. ఇదేమి శాశ్వతం కాదు. ఈ ఒక్క వారమే కదా నువ్వు టాస్క్ లు ఆడనిది ఏపీ పర్లేదు అంటూ శివాజీ ప్రశాంత్ ను ఓదార్చాడు. ఇంకా కసి పెంచుకో.. ఏందిరా ప్రశాంత్.. ఏడవకు.. నాకు నచ్చలే అని చెప్పుకొచ్చాడు. ఆతర్వాత వీర సింహాలు టీమ్ దగ్గరికెళ్లి రేయ్ దమ్ముంటే నన్ను తీయాల్సిందిరా.. వాడిని కాదురా.. అంటూ నవ్వుతు సవాల్ చేశాడు శివాజీ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.