
నిన్నటి ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున వరుసగా హౌస్ లో ఉన్నవారిని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి మరీ క్లాస్ తీసుకున్నారు. కాస్త సీరియస్ గానే నిన్నటి ఎపిసోడ్ జరిగిందని చెప్పాలి. ముందుగా శోభా శెట్టిని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచిన నాగార్జున ఆమె పై సీరియస్ అయ్యారు.సంచలక్ గా ఉంది ప్రియాంకాకు సపోర్ట్ చేయడం పై నాగార్జున ఫైర్ అయ్యారు. శోభా శెట్టి ఎదో కవర్ చేయడానికి ట్రై చేసింది కానీ వర్కౌట్ కాలేదు. దాంతో చివరకు కన్నీళ్లు కూడా పెట్టుకుంది. దాంతో చేసేదేం లేక ఆమెకు దైర్యం చెప్పి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అనే ఫీలింగ్ ఇక్కడ ఏం లేదు.. నువ్వు మా మోనితవి, మా శోభా శెట్టివే అంటూ ఓ డైలాగ్ కొట్టి పంపించేశారు. ఆతర్వాత యావర్ ను ఛీ.. తూ.. అనడం పై క్లాస్ తీసుకున్నారు. శోభా కు యావర్ సారి చెప్పాల్సిందే అని అన్నారు నాగార్జున. ఆతర్వాత పల్లవి ప్రశాంత్ పై కూడా సీరియస్ అయ్యారు నాగ్.
నిజంగా కొరికాడా అమర్ నిన్ను.. ఏది ఇప్పుడు చూపించు.. అంటూ అడిగాడు నాగార్జున. దీంతో చేయి చూపించాడు ప్రశాంత్.. గేమ్ ఆడే సమయంలో నువ్వు అమర్ మెడ పట్టుకున్నావ్ దాంతో ఎదో అలా జరిగింది అని అన్నారు. లేదు సార్ కోరినప్పుడు వాపు కూడా వచ్చింది డాక్టర్ ట్యాబ్లేట్లు కూడా ఇచ్చారు అని చెప్పాడు ప్రశాంత్. దానికి నేను డాక్టర్ ను అడిగాను ప్రశాంత్.. నో మర్క్స్ , నో బ్లెడ్ అని చెప్పారు అన్నాడు నాగార్జున. ఆతర్వాత శివాజీకి ప్రశాంత్ సేవలు చేయడం పై సీరియస్ అయ్యారు. గులాం గిరి చేయడానికి వచ్చావా.. ఆట మీద దృష్టి పెట్టు అంటూ క్లాస్ తీసుకున్నారు నాగార్జున.
ఆతర్వాత శివాజీ వంతు వచ్చింది.. నాగార్జునకి శివాజీకి మధ్య డిస్కషన్ గట్టిగా జరిగింది. నాగార్జున చెప్పే ప్రతి విషయానికి శివాజీ అడ్డంగా వాదించారు. నీకు లాంటి వాళ్లు మా ఇంట్లో ఉంటే పీక మీద కాలేసి తొక్కుతా రా అని శివాజీ అన్న డైలాగ్ పై నాగార్జున సీరియస్ అయ్యారు. ఎందుకు ఆ మాట అన్నావ్ అని శివాజీని అడిగారు నాగ్. వాళ్ళు ప్రశాంత్ ను టార్చర్ చేస్తున్నారు. నాకున్న ఎక్స్ పీరియన్స్ తో ఆ మాట అన్నాను అని శివాజీ అన్నాడు. అంటే ఆ బాధలో పీకుతావా.. అని నాగ్ అంటే తప్పు చేస్తే కొడతాను.. అని శివాజీ చెప్పాడు. మన ఇంట్లో ఆడపిల్ల అయితే గొంతు మీద కాలేసి తొక్కేవాడిని.. అన్నావ్ అదేం బాషా అని నాగార్జున అడిగితే .. మాది పల్నాడు బాబుగారు. మా మాట తీరు అలానే ఉంటుంది.. దానికి నాగార్జున కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఆడియన్స్‌లో ఒక అమ్మాయి చేత మాట్లాడించారు నాగార్జున. ఆడపిల్లలను అలా అనకూడదనిపించింది సార్ అంటూ ఆ యువతి చెప్పింది. దానికి మరి మగపిల్లల్ని ఏమైనా అనొచ్చా.? అని తిరిగి ప్రశ్నించాడు. దాంతో నాగార్జున డైవర్ట్ చేయకు శివాజీ అని గాలితీసేశారు. దాంతో ప్లేట్ మార్చిన శివాజీ. కోపంలో అంటే చేస్తామా.. పీకమీద కాలేసి తొక్కుతారా.. సహనం అయిపోయింది అని చెప్పుకొచ్చాడు. ఇది పొరపాటు అంతే క్షమించండి.. అని శివాజీ అన్నాడు. నాకు చెప్పడం కాదు ఆడియన్స్ లో ఉన్న ఆడపిల్లలందరికి చెప్పు అన్నారు. దానికి వాళ్లందరికీ ఎందుకు కనెక్ట్ అవుతుంది బాబుగారు. నేను మా ఇంట్లో సంగతి చెప్పాను సార్.. దీన్ని జనరలైజ్ ఎందుకు చేస్తున్నారంటూ రివర్స్ అయ్యాడు. నువ్వు నాలుగు గోడల మధ్య చెప్పలేదు శివాజీ.. షోలో మాట్లాడవు అని నాగార్జున అన్నారు. దాంతో శివాజీ పొరపాటు అయితే క్షమించండి అని అన్నాడు. ఆతర్వాత మరో వీడియో చూపించాడు నాగార్జున అందులో.. ఏంట్రా వీళ్లు.. ఇలా చేస్తే రేపు పెళ్లి చేసుకునేవాడు భయపడతాడు కదా అని శివాజీ అనడం చూడొచ్చు. వాళ్ల జీవితం.. వాళ్ల భవిష్యత్తు.. నీకెందుకు శివాజీ అని అన్నారు నాగ్. మరి నా జోలికొస్తే ఊరుకుంటానా అని అన్నాడు. దానికి నీ మాటలు విని వాళ్లని చేసుకోవాల్సిన వాళ్లు నిర్ణయం మార్చుకుంటే.. అని తిరిగి నాగార్జున ప్రశ్నిస్తే దానికి ఇంకేదో చెప్పాడు శివాజీ. ఇప్పుడు దొర్లిన మాటలకి క్షమాపణ కోరుతున్నాను.. కానీ నేను వాంటెడ్‌గా మాత్రం మాట్లాడలేదు.. ప్రియాంక శోభాకు సారి చెప్పు.. నేను నీ ప్లేస్‌లో ఉంటే సారీ చెబుతాను అని నాగార్జున అన్నారు. దాంతో శివాజీ వాళ్ళిద్దరికి సారి చెప్పాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.