బిగ్‌బాస్ సీజన్ 7 ఇక ముగింపుకు వచ్చేసింది. సరిగ్గా రెండు వారాల ఆట మాత్రమే మిగిలింది. అయితే చివరి నామినేషన్స్ ప్రక్రియ హౌస్‌లో హీటెక్కించింది. నువ్వా నేనా అంటూ కొట్టుకున్నంత పనిచేశారు హౌస్మేట్స్. ముఖ్యంగా అమర్ వర్సెస్ ప్రశాంత్ ఇద్దరి మధ్య తారాస్థాయిలో గొడవ జరిగింది. ఇక గతవారం ఫినాలే అస్త్ర గెలుచుకోవడంతో అర్జున్ అంబటి అతడిని ఎవరు నామినేట్ చేయడానికి వీలు లేదు. ఇక ఈ వారం మిగిలింది SPA బ్యాచ్ vs SPY బ్యాచ్. దీంతో ఈ రెండు టీంలు రెచ్చిపోయారు. ఇక ఎప్పటిలాగే మరోసారి ప్రశాంత్‌ను దెబ్బకొట్టాడు అమర్ దీప్. బలహీన క్షణాల్లో తన వెన్నంటే ఉండి కన్నీళ్లు తుడిచిన రైతుబిడ్డను మరోసారి నామినేట్ చేశాడు అమర్. అంతేకాదు సహనం కోల్పోయి ప్రశాంత్ ను గుండెలతో నెట్టుకుంటూ పోయాడు. రెండు సార్లు కెప్టెన్సీలో సపోర్ట్ చేసినందుకు అమర్ దీప్ చేసిన నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు ప్రశాంత్.
నిన్నటి ఎపిసోడ్లో ముందుగా ప్రశాంత్.. గతవారం తనను నామినేట్ చేసినందుకు ఈసారి అమర్ ను నామినేట్ చేశాడు. ఇక ఆతర్వాత శోభాను నామినేట్ చేశాడు. అయితే అమర్ తిరిగి ప్రశాంత్ ను నామినేట్ చేస్తూ.. సిల్లీ, సిల్లీ రీజన్స్ చెప్తూ నామినేట్ చేస్తున్నాడని అన్నాడు. దీంతో ప్రశాంత్ తన బాధను బయటపెట్టాడు. ‘నీ నిజస్వరూపం మళ్లీ బయటపడింది. నువ్వు మోసం చేసే రకం. నీ గుణమే అది’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ప్రశాంత్. దీంతో నీకు అలవాటే కదా..స్టేట్మేంట్ పాస్ చేయడం.. మళ్లీ హౌస్ లోకి తీసుకుంటే నామినేషన్స్ పెట్టకు అంటూ ఏదేదో మాట్లాడాడు. ‘నేను నామినేషన్స్ గురించి మాట్లాడం లేదన్నా.. నువ్వు చేసిన నమ్మకద్రోహం గురించి మాట్లాడుతున్నా.. ‘ అంటూ ఎమోషనల్ అయ్యాడు ప్రశాంత్. దీంతో పోరా అన్నాడు అమర్. నన్ను పోరా అనొద్దు.. రా అనుకు పేరు పెట్టి పిలువు అని ప్రశాంత్ అనడంతో నా తమ్ముడ్ని రా అనే అంటా నామినేషన్స్ చేస్తే మాట్లాడడంట అంటూ రెచ్చిపోయాడు అమర్. నువ్వు మారావ్.. నీతో ఇక మాట్లాడను. మనసు పగిలిపోయింది… నీతో ఇక మాట్లాడను..నాతో మాట్లాడకు.. బాంచన్ నీ కాళ్లు మొక్కుతా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ప్రశాంత్.
దీంతో సహనం కోల్పోయిన అమర్.. నీ డ్రామాలు నాకు తెలుసు, నీకే అంత ఉంటే.. నాకెంత ఉండాలంటూ రెచ్చిపోయాడు. ఇద్దరి మధ్య చాలాసేపు మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు అరుచుకుంటూ మీద మీదకు వెళ్లారు. దీంతో శివాజీ మధ్యలో కల్పించుకుని ఇద్దరిని విడదీశాడు. అయితే నామినేషన్స్ తర్వాత అమర్ చేసిన మోసాన్ని గుర్తుచేసుకుని భోరున ఏడ్చేశాడు ప్రశాంత్. ఫినాలే అస్త్రలో అర్జున్ అన్న, నువ్వు ఉంటే నా పాయింట్స్ నీకే ఇస్తానని యావర్ తో చెప్పిని. నిన్ను సపోర్ట్ చేసినందుకు నన్ను మోసం చేశావ్.. నా గుండెలపై తన్నావ్. నీ గురించి ఒక్కమాట పక్కకు వచ్చి మాట్లాడలేదు అంటూ ఎమోషనల్ అయ్యాడు ప్రశాంత్. దీంతో అమర్ వచ్చి శారీ చెప్పాడు. కానీ నిజానికి.. గతవారం బాల్ టాస్కులలో అమర్ కు ఇచ్చిన మాట ప్రకారం అతడిని కొట్టలేదు ప్రశాంత్. అలాగే ఆ తర్వాత అమర్ ఫోటోను కాల్చకుండా తనకే సపోర్ట్ చేశాడు. తనకు కెప్టెన్ కావడానికి అడ్డుపడిన వాళ్లను కాకుండా.. వెన్నెంటే ఉండి సపోర్ట్ చేసిన వాళ్లను నామినేట్ చేస్తూ వస్తున్నాడు అమర్. ఇప్పుడు మరోసారి తన కోసం నిలబడిన ప్రశాంత్‌ను నామినేట్ చేశాడు.