బిగ్ బాస్ సీజన్ 6లో ఫైనాన్సియల్‌గా గెయిన్ అయ్యింది ఎవరంటే..? శ్రీహాన్ అనే చెప్పాలి. టైటిల్ విజేతకు దక్కే రూ.50 లక్షల్లో.. సూట్ కేస్ ఆఫర్ ద్వారా రూ. 40 లక్షలు శ్రీహాన్ సొంతం చేసుకున్నాడు. విన్నర్ రేవంత్‌కు ప్రైజ్ మనీలో మిగిలిన పది లక్షలతో పాటు రూ. 25 లక్షల విలువైన ఫ్లాట్, మరో 10 లక్షలు విలువైన కారు దక్కాయి. అంటే వీక్లీ రెమ్యూనరేషన్ కాకుండా అతడికి 45 లక్షలు గిట్టుబాటు అయినట్లు లెక్క. అయితే ఓట్ల కేటగిరీ చూసుకుంటే శ్రీహాన్ స్వల్ప మెజార్టీతో ముందున్నాడని నాగార్జున చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు.
అయితే ఇక్కడే శ్రీహాన్‌కు మరో ఆఫర్ వచ్చింది. తమ వద్ద ఫ్లాట్ కొనుగోలు చేస్తే.. అతడికి 50% డిస్కౌంట్ ఇస్తామని సువర్ణభూమి వాళ్ళు చెప్పారు. అది వినియోగించుకుంటే శ్రీహానే ఎక్కువగా గెయిన్ అయినట్లు లెక్క. ఇక వీక్లీ రెమ్యూనరేషన్ ఎలాగూ ఉంటుంది. తనకు వచ్చిన మొత్తంతో తన లవర్ సిరికి మంచి గిఫ్ట్ కొంటానని శ్రీహాన్ తెలిపాడు. అలాగే సువర్ణభూమి వారి ఆఫర్ వినియోగించుకుంటానని చెప్పాడు.
15 వారాల పాటు బిగ్ బాస్ ఇంట్లో ఉన్నాడు శ్రీహాన్. రేవంత్ కంటే కాస్త ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నప్పటికీ.. సూట్ కేసు ఆఫర్ తీసుకున్న కారణంగా అతడు ఫస్ట్ రన్నరప్ అయ్యాడు. అయితే అతడు వారానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అన్నది ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అయ్యింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అతడికి వారానికి లక్ష రూపాయలు ఇచ్చారట. ఈ లెక్కన 15 వారాలకు 15 లక్షలు అందుకున్నాడు. అదీ కాక.. స్టైలిష్ కంటెస్టెంట్ ఆఫ్ ద సీజన్‌గా నిలిచి మరో రూ.5 లక్షల రూపాయలు బోనస్ అందుకున్నాడు. ఇవి ఇరవై.. సూట్ కేస్ ఆఫర్ ద్వారా వచ్చిన 40… మొత్తం 70 లక్షలు.. ఇది కాక ఫ్లాట్ కొంటే 50 శాతం డిస్కౌంట్. ఏ లెక్కన చూసుకున్నా.. ఈ బిగ్ బాస్ సీజన్‌లో డబ్బు చేసుకుంది మాత్రం శ్రీహానే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..