Bigg Boss 6 : మిడ్ వీక్‌లో ఊహించని ట్విస్ట్.. హౌస్ నుంచి ఎలిమినేట్ అయినా శ్రీసత్య

|

Dec 17, 2022 | 8:24 AM

హౌస్ లో ఉన్న రేవంత్, శ్రీహాన్, శ్రీ సత్య, కీర్తి, రోహిత్, ఆదిరెడ్డి లో ఒకరు ఈ వారం మధ్యలోనే ఎలిమినేట్ అవుతారని గత ఆదివారం నాగార్జున చెప్పారు.

Bigg Boss 6 : మిడ్ వీక్‌లో ఊహించని ట్విస్ట్.. హౌస్ నుంచి ఎలిమినేట్ అయినా శ్రీసత్య
Sri Satya
Follow us on

బిగ్ బాస్‌లో ఊహించని ట్విస్ట్ లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు ఉండగా ఈ వారం మధ్యలో ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. హౌస్‌లో ఉన్న రేవంత్, శ్రీహాన్, శ్రీ సత్య, కీర్తి, రోహిత్, ఆదిరెడ్డి లో ఒకరు ఈ వారం మధ్యలోనే ఎలిమినేట్ అవుతారని గత ఆదివారం నాగార్జున చెప్పారు. నాగ్ చెప్పినట్టే ఈ వారం హౌస్ నుంచి శ్రీ సత్య ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. అయితే అందరు కీర్తి హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు కానీ ఊహించని విధంగా శ్రీ సత్య ఎలిమినేట్ అయ్యింది. ప్రేక్షకులు వేసిన ఓట్ల ఆధారంగా శ్రీ సత్యను ఎలిమినేట్ చేసినట్టు బిగ్ బాస్ ప్రకటించాడు. అంతకు ముందు.. హౌస్ మేట్స్ ను ఎవరు ఎలిమినేట్ అవ్వాలని అనుకుంటున్నారో చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించాడు. దాంతో చాలా మంది కీర్తి పేరు చెప్పగా.. అందరూ కూడా ఆమే ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు.

శ్రీహాన్ – రోహిత్‌, కీర్తి – ఆది రెడ్డి, శ్రీసత్య – కీర్తి, రోహిత్ – శ్రీహాన్, రేవంత్ – కీర్తి, ఆదిరెడ్డి – కీర్తి పేర్లు చెప్పారు. దాంతో ఎక్కువమంది కీర్తి పేరు చెప్పడంతో ఆమె ఎలిమినేట్ అవుతుందని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా శ్రీసత్య ఎలిమినేట్ అయ్యింది. శ్రీ సత్య ఎలిమినేట్ అని బిగ్ బాస్ అనౌన్స్ చేయడంతో రేవంత్ ఎమోషనల్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

నా కోపాన్ని అర్ధం చేసుకున్న మొదటి అమ్మాయి శ్రీ సత్య అంటూ ఆమెను హగ్ చేసుకొని ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత ఫస్ట్ వీక్ నుంచి మేము ముగ్గరం కలిసి ఉన్నాం అంటూ శ్రీహాన్, శ్రీసత్య, రేవంత్ హగ్ చేసుకుని ఎమోషనల్ అయిపోయారు. శ్రీసత్య వెళ్లిపోవడంతో టాప్ 5లో రేవంత్, శ్రీహాన్, కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్ ఉన్నారు. వీరిలో బిగ్ బాస్ విన్నర్ ఎవరవుతారో చూడాలి.