Bigg Boss 5 Telugu: నెక్స్ట్ లెవల్‌కి పింకీ- మానస్ ప్రేమకథ.. హౌస్‌లో హగ్గులతో హల్‌చల్

|

Nov 06, 2021 | 7:38 PM

బిగ్‏బాస్ ప్రస్తుతం 62 ఎపిసోడ్స్‌ను పూర్తిచేసుకుంది. పూర్తి చేసుకోవడమే కాదు.. టీఆర్పీలో టాప్‌ రేంజ్‌లో దూసుకుపోతోంది.

Bigg Boss 5 Telugu: నెక్స్ట్ లెవల్‌కి పింకీ- మానస్ ప్రేమకథ.. హౌస్‌లో హగ్గులతో హల్‌చల్
Priyanka
Follow us on

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ ప్రస్తుతం 62 ఎపిసోడ్స్‌ను పూర్తిచేసుకుంది. పూర్తి చేసుకోవడమే కాదు.. టీఆర్పీలో టాప్‌ రేంజ్‌లో దూసుకుపోతోంది. ఇక షో బిగినింగ్‌లోనే లవ్ ట్రాక్స్‌తో లవ్లీగా సాగిన బిగ్ బాస్ మధ్యలో టాస్క్‌లతో రసవత్తరంగా సాగినా… అండర్ కరెంట్‌ గా లవ్‌ అనే ఎలిమెంట్‌ మాత్రం ఎలివేట్ అవుతూనే ఉంది. ఎలిమినేషన్ కారణంగా శ్రీరామ్, హమీదా లవ్‌కు బ్రేక్‌ పడినప్పటికీ.. ప్రియ మాత్రం తన ప్రేమను మానస్‌ పై కురిపిస్తూనే ఉంది. అయితే ఈ ప్రేమే తాజాగా హద్దులు దాటుతుందని అంటున్నాడు బిగ్ బాస్‌లో ఉన్న మరో కంటెస్టెంట్.. మానస్‌ బ్రెండ్ ఫ్రెండ్ సన్నీ.ఎప్పుడూ మానస్‌ వెనకే తిరుగుతూ.. లేచినప్పటి నుంచి మానస్‌కు సేవ చేస్తూ ఉండే ప్రియాంక తాజాగా బుంగ మూతి పెట్టి మరీ మానస్‌ నువ్వు హర్ట్ చేశావంటూ … కాస్త హంగామా చేసే ప్రయత్నం చేసింది. దీంతో మానస్ కాస్త సీరియస్ గా ఈ విషయాన్ని ఓ ఛాన్స్‌గా తీసుకుని పింకీ కి బాయ్‌ చెప్పే ప్రయత్నం తాజా ఎపిసోడ్‌లో చేశాడు.

కాని పింకీ ఊరుకోదు కదా…! పెట్టిన బుంగమూతిని.. స్మైలీ ఫేస్గా మార్చి మరీ మానస్‌కు సారి చెప్పింది. సారీ చెప్పడమే కాదు.. మానస్‌ వద్దంటున్నా గట్టిగా వాటేసుకుంది. ఇక ఈ సీన్‌ చూసిన సన్నీ ఈ దారుణం ఏంటి ? అంటూ ఆ పక్కనే ఉన్న కాజల్ కు చూపించాడు. కాజల్ ఏమో వెరీ క్యాజువల్గా వాళ్లు గాఢంగా ప్రేమించుకుంటున్నారు రా… అంటూ ఆ లవ్‌ సీన్‌కు ఆర్జేయింగ్ చేసింది. ఇక ఇది చూసిన బీబీ అభిమానులు.. హద్దులు దాటుతుందమ్మా.. మీ లవ్వు అంటూ సోషల్ మీడియాలో కమెంట్లు చేస్తూ ఈ సీన్‌ను వైరల్ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Puneeth Rajkumar : చిన్నవయసులో అప్పు మనల్ని వదిలి వెళ్లిపోయాడంటే మనసుకు కష్టంగా ఉంది.. కన్నీటి పర్యంతం అయిన జయప్రద..

Allu Arjun: మరో బిజినెస్ మొదలు పెట్టిన ఐకాన్ స్టార్.. థియేటర్ ఓనర్‌గా అల్లు అర్జున్

Jai Bhim: నేనూ ఇలాంటి దారుణాలు చూశాను.. హైదరాబాద్‌లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి.. ‘జై భీమ్‌’ సినిమాపై ఐఏఎస్ అధికారి స్పందన..