Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ వల్ల జరిగిన మొదటి మంచి పని ఇదేనట.. కామెంట్ చేస్తున్న నెటిజన్లు..

బిగ్ బాస్ గేమ్ షోలో అన్నీ ఎమోషన్స్ ఉంటాయి.. అందుకే ఈ గేమ్ షో ప్రేక్షుకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.. నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న ఈ గేమ్ షో

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ వల్ల జరిగిన మొదటి మంచి పని ఇదేనట.. కామెంట్ చేస్తున్న నెటిజన్లు..
Priyanka

Updated on: Oct 07, 2021 | 5:31 PM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ గేమ్ షోలో అన్నీ ఎమోషన్స్ ఉంటాయి.. అందుకే ఈ గేమ్ షో ప్రేక్షుకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.. నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న ఈ గేమ్ షో విజయవంతంగా నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ఇప్పుడు ఐదో సీజన్ కూడా జరుపుకుంటుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 5లో కావాల్సినంత వినోదం దొరుకుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంటిసభ్యుల మధ్య గొడవలు, ప్రేమలు, అల్లర్లు, ఏడుపులు ఇలా నానా హంగామాగా ఉటుంది. ఇక ఈ సీజన్ లో 19మంది హౌస్ లోకి వచ్చిన విషయం తెలిసిందే.. అందులో ఇప్పటికే నలుగురు బయటకు వచ్చేశారు. ఇదిలా ఉంటే నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను  విడుదల చేశారు. నేడు ప్రియాంక పుట్టిన రోజు కావడంతో ఆమెకు జీవితంలో మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చారు బిగ్ బాస్.

ప్రియాంక సింగ్ గురించి దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. ఆమె ఓ ట్రాన్స్ జెండర్.. ఆమె అమ్మాయిగా మారడం తన ఇంట్లోవాళ్లకు ఇష్టం లేదని.. తాను అలా మారిన దగ్గర నుంచి తన తండ్రి ఇంటికి రానివ్వడంలేదు అని.. చాలా సార్లు చెప్పుకొని బాధపడింది ప్రియాంక. తాజాగా నేడు ఆమె పుట్టిన రోజు కావడంతో ప్రియాంక తండ్రి వీడియోను ప్లే చేశారు. ఈ వీడియోలో ఆయన ప్రియాంకను ఇంటికి ఆహ్వానించారు. దాంతో ప్రియాంక ఆనందంతో కన్నీరు పెట్టుకుంది. తన ఇంటికి కూడా దొంగల వెళ్లాల్సి వస్తుందని.. తాను ఇంటికి వస్తే పక్కింటివాళ్లకు కూడా తెలియదని చెప్పుకొచ్చింది ప్రియాంక. వెళ్లి తనను పట్టుకొని గట్టిగా ఏడవలని ఉంది అంటూ ఎమోషనల్ అయ్యింది ప్రియాంక.. ఆతర్వాత హౌస్ లో ఉన్నవారందరూ ప్రియాంకకు చీర గాజులతో అలంకరించారు. ఈ ప్రోమో పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ వల్ల జరిగిన మొదటి మంచి పని ఇదే అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Varun Tej’s Ghani: మొదటి పంచ్ విసిరిన మెగా హీరో.. వరుణ్ తేజ్ ‘గ‌ని’ ఫస్ట్ గ్లింప్స్ ..

Manchu Vishnu on MAA Elections 2021: మేనిఫెస్టో తో మీడియా ముందుకు మంచు విష్ణు.. ఆ బాధ్యత నాదే అంటూ కీలక నిర్ణయం..(లైవ్ వీడియో)

Rukshar Dhillon:క్యూట్ క్యూట్ అందాలతో అలరిస్తోన్న రుక్సార్ ధిల్లాన్ లేటెస్ట్ పిక్స్