బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ హారిక తన క్యూట్ స్మైల్‌తో పాటు చక్కనైన అందాలతో ఆకట్టుకుంటుంది. ఆమె చేసే కొన్ని యాక్ట్స్ భలే క్యూట్‌గా ఉంటాయి. ఇటీవల టాస్కులో భాగంగా చేసిన షూటింగ్‌లో సోహైల్‌తో కలిసి కెవ్వు కేక ఐటెమ్ నంబర్‌కు చిందేసి అదరగొట్టింది. అయితే హారిక అభిపై ఎక్కువ ఆధారపడుతుంది. ఫ్రెండ్షిప్ చేసినా తన ఆట తను ఆడుకుంంటూ ఉంటే ఇంకా స్ట్రాంగ్‌గా ఉండేది. గతంలో అభి..టాస్కులో భాగంగా మోనల్‌కు హెల్ప్ చేస్తుంటే చాలా ఫీలయిపోయింది. స్ట్రైయిట్‌గా ‘వై నాట్ మీ’ అని అడిగేసింది. ఆ సమయంలో అభి చేయి పట్టుకుని సారీ చెప్పడంతో శాంతించింది. తన కాస్త పొసెసివ్ అని ఒకొనొక సందర్భంలో హారికనే స్వయంగా చెప్పింది. ఇక టిప్ అడిగాడని కుమార్ సాయిని నామినేట్ చేయడం హారికకు బాగా మైనస్ అయ్యింది. సేఫ్‌గా గేమ్ ఆడే క్రమంలో భాగంగానే ఆమె ఇలా చేసిందని చాలామంది అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా ఈ వారం అభి తనని తాను నామినేట్ చేసుకోవడంతో గండం గడిచింది. లేకపోతే ఆమె ఈ సారి చాలా డేంజర్ జోన్‌లో ఉండేది.
Also Read :