Syed Sohel Ryan: మంచి మనసు చాటుకున్న సోహెల్.. అన్న మాటప్రకారం సామాజిక బాధ్యతతో సహాయం..

బిగ్ బాస్‌ సీజన్‌ 4లో తనదైన మాటలతో చలాకీ తనంతో.. అందర్నీ ఆకట్టుకున్నారు సయద్‌ సోహైల్. ఆ షోలో టాప్‌ 3 కంటెస్టెంట్‌గా ఉన్నప్పటికీ..

Syed Sohel Ryan: మంచి మనసు చాటుకున్న సోహెల్.. అన్న మాటప్రకారం సామాజిక బాధ్యతతో సహాయం..

Updated on: Jun 11, 2021 | 5:41 PM

Syed Sohel Ryan: బిగ్ బాస్‌ సీజన్‌ 4లో తనదైన మాటలతో చలాకీ తనంతో.. అందర్నీ ఆకట్టుకున్నారు సయద్‌ సోహైల్. ఆ షోలో టాప్‌ 3 కంటెస్టెంట్‌గా ఉన్నప్పటికీ.. తనంతటే తానే డబ్బు తీసుకుని బయటికి వచ్చారు. ఇక ఆ తరువాత అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో తన కెరీర్‌ బిల్డ్ చేసుకునే పనిలో పడ్డారు. బిగ్ బాస్ హౌస్ సింగరేణి బిడ్డ అంటూ అందరి మనసులు గెలుచుకున్నాడు. అంతే కాదు ఏకంగా మెగాస్టార్ కూడా సోహెల్ ను అభినందించారు. సోహెల్ చేసే సినిమాలో ఓ చిన్న పాత్ర చేస్తానని మెగాస్టార్ చిరంజీవి మాట కూడా ఇచ్చారు. ప్రస్తుతం సోహెల్ ఒకటి రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. త్వరలోనే ఆ సినిమాల వివరాలు తెలియనున్నాయి.

ఇదిలా ఉంటే బిగ్ బాస్‌ షో అవార్డ్ సెర్మనీలోనే తాను గెలిచిన 10 లక్షల రూపాయలను పేదల కోసం ఖర్చు పెడతానన్న సోహైల్.. అందుకు తగ్గట్టే సోహైల్ హెల్పింగ్ హ్యాండ్ అనే చారిటీని ఏర్పాటు చేసి.. సామాజిక బాధ్యతతో సహాయం చేస్తున్నారు. ఈ మేరకు తాను ఇప్పటి వరకు చేసిన పలు సేవలను… పెట్టిన ఖర్చును ఓ వీడియో ద్వారా పంచుకున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pawan Kalyan : కరోనా కారణంగా ఆలస్యం అవుతున్న పవన్ సినిమాలు.. సంక్రాంతికి రానున్న రీమేక్..

Thank You: అక్కినేని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. నాగచైతన్య థాంక్యూ మూవీ ఫస్ట్ లుక్ త్వరలోనే..

Nandamuri Balakrishna: దర్శకత్వం బాల‌య్య‌.. హీరో మోక్షజ్ఞ.. మ‌రో క్రేజీ విష‌యం ఏమిటంటే..