AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ariyana Glory: ప్రపంచంలో అందమైన వాటిని చూడలేము.. వాటిని మనసుతో ఆస్వాదించాల్సిందే. అరియానా బ్యూటిఫుల్‌ ఫొటోస్‌..

Ariyana Glory: అరియానా గ్లోరీ.. రామ్‌గోపాల్‌ వర్మను ఇంటర్వ్యూ చేసే కంటే ముందు ఈ పేరు ఎవరికీ తెలియదు. కానీ ఒక్క ఇంటర్వ్యూతో ఎక్కడలేని క్రేజ్‌ను సొంతం చేసుకుందీ బ్యూటీ....

Ariyana Glory: ప్రపంచంలో అందమైన వాటిని చూడలేము.. వాటిని మనసుతో ఆస్వాదించాల్సిందే. అరియానా బ్యూటిఫుల్‌ ఫొటోస్‌..
Ariyana Glory
Narender Vaitla
|

Updated on: Aug 01, 2021 | 7:34 AM

Share

Ariyana Glory: అరియానా గ్లోరీ.. రామ్‌గోపాల్‌ వర్మను ఇంటర్వ్యూ చేసే కంటే ముందు ఈ పేరు ఎవరికీ తెలియదు. కానీ ఒక్క ఇంటర్వ్యూతో ఎక్కడలేని క్రేజ్‌ను సొంతం చేసుకుందీ బ్యూటీ. ఆర్జీవీ చేసిన ఇంటర్వ్యూతో ఓవర్‌ స్టార్‌ నైట్‌గా మారిందీ చిన్నది. ఈ స్టార్‌డమ్‌తోనే బిగ్‌బాస్‌లో పాల్గొనే అవకాశాన్ని సొంతం చేసుకుంది అరియానా. ఈ షోలో తనదైన ఆటతీరుతో బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుందీ బ్యూటీ. బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో వచ్చిన ఫేమ్‌ను సక్రమంగా ఉపయోగించుకునే పనిలో పడ్డ అరియానా వెబ్‌ సిరీస్‌లో నటించే అవకాశాలను సైతం సొంతం చేసుకుంటోంది.

ఇక తాజాగా రామ్‌ గోపాల్‌ వర్మతో మరో బోల్డ్‌ ఇంటర్వ్యూ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది అరియానా. అతి తక్కువ సమయంలో సినిమాల్లో నటించకుండా ఇంతలా పాపులారిటీ సంపాదించుకుంది అరియానా. కేవలం తన అందంతోనే కాకుండా క్యూట్‌ మాటలతోనూ ఆకట్టుకుంటోందీ బ్యూటీ. ఇదిలా ఉంటే కేవలం ఇంటర్వ్యూలు, వెబ్‌ సిరీస్‌లకే పరిమితం కాకుండా సోషల్‌ మీడియా ద్వారా కూడా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటుంది అరియానా. ఈ క్రమంలోనే తన లేటెస్ట్‌ ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకుంది. సిల్వర్‌ కలర్‌ డ్రస్‌లో దగదగ మెరిసిపోతున్న ఫొటోలను షేర్‌ చేసిన ఈ బ్యూటీ.. ‘ప్రపంచంలో అందమైన వాటిని చూడలేము, చివరికి తాకలేము కూడా.. వాటిని మనసుతో ఆస్వాదించాల్సిందే’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది. అరియానా లేటెస్ట్‌ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి మరి..

Also Read: Shilpa Shetty Defamation Suit: శిల్పా శెట్టికి ఊరట.. ఆ వీడియోలు తొలగించాలని ఆదేశించిన బాంబే హైకోర్టు..

Nayantara: చాయ్ వాలేతో జతకట్టిన లేడీ సూపర్ స్టార్.. అమ్మడు సక్సెస్ అవుతుందా ?

Ram Pothineni: రామ్ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. ఇస్మార్ట్ హీరో సరసన అందాల తార..