ఇదెక్కడి విడ్డూరం..! బర్రెలక్కకు- బిగ్ బాస్ రైతు బిడ్డకు పెళ్లి..? అసలు విషయం ఇదే

ముందుగా బర్రెలక్క గురించి మాట్లాడుకుందాం.. బర్రెలక్క అలియాస్ శిరీష.. ఆ మధ్య సర్కారు సక్కగా పట్టించుకోకపోవడంతో డిగ్రీ చేసికుడా నౌకరి రాకపోవడంతో బర్రెలు కాస్తున్నా అంటూ ఓ వీడియో షేర్ చేసింది. అంతే సోషల్ మీడియా సంగతి తెలిసిందేగా.. క్షణాల్లో ఆ వీడియో వైరల్ అవ్వడం.. బర్రెలక్కకు ఫాలోవర్స్ పెరగడం జరిగిపోయాయి.. అంతేకాదు ఈ క్రేజ్‌తో పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చింది ఈ అక్క.

ఇదెక్కడి విడ్డూరం..! బర్రెలక్కకు- బిగ్ బాస్ రైతు బిడ్డకు పెళ్లి..? అసలు విషయం ఇదే
Pallavi Prashanth, Barrelak

Updated on: Jan 31, 2024 | 12:29 PM

బర్రెలక్క- రైతు బిడ్డ.. ఈ ఇద్దరి గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో.. ఒకళ్ళు పొలిటికల్ ఎంట్రీతో క్రేజ్ తెచ్చుకుంటే.. మరొకరు టీవీ షోతో పాపులర్ అయ్యారు. ముందుగా బర్రెలక్క గురించి మాట్లాడుకుందాం.. బర్రెలక్క అలియాస్ శిరీష.. ఆ మధ్య సర్కారు సక్కగా పట్టించుకోకపోవడంతో డిగ్రీ చేసికుడా నౌకరి రాకపోవడంతో బర్రెలుకాస్తున్నా అంటూ ఓ వీడియో షేర్ చేసింది. అంతే సోషల్ మీడియా సంగతి తెలిసిందేగా.. క్షణాల్లో ఆ వీడియో వైరల్ అవ్వడం.. బర్రెలక్కకు ఫాలోవర్స్ పెరగడం జరిగిపోయాయి.. అంతేకాదు ఈ క్రేజ్‌తో పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చింది ఈ అక్క. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకూడా చేసింది.. పెద్ద సార్లు  జేడీ లక్ష్మీ నారాయణ, మల్లాడి కృష్ణారావులాంటి వారు మద్దతు తెలుపడంతోపాటు ఆర్థిక సాయం కూడా చేశారు. పాపం అనుభవం లేని అక్కకు 5వేలకు పైగా ఓట్లు మాత్రమే పడ్డాయి.

అయితే ఇప్పుడు బర్రెలక్క పెళ్లి చేసుకోబోతుందని టాక్ వైరల్ అయ్యింది. వరుడు ఎవరో కాదు మన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అంటున్నారు. ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అక్కడితో ఆగలేదు కొంతమంది ఒకడుగు ముందుకేసి ఈ ఇద్దరికీ ఆల్ రెడీ పెళ్లి కూడా అయిపోయిందని పుకార్లు పుట్టించారు. బిగ్ బాస్ పుణ్యమా అని రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. విన్నర్ కూడా అయ్యాడు. అన్నా.. అన్నా అంటూ వీడియోలు చేసి ఫెమస్ అయినా ప్రశాంత్ కు బర్రెలక్కాకు పెళ్లి అంటూ సోషల్ మీడియాలో కొందరు కోడై కూస్తున్నారు.

దాంతో తన పెళ్లి వార్తల పై స్పందించింది బర్రెలక్క. నేను బిగ్ బాస్ షోను చూడను.. ఎదో రెండు ఎపిసోడ్ లు చూశాను. ఎన్నికల ప్రచారం హడావిడిలో పడి దాన్ని పక్కన పెటేశా.. లాస్ట్ లో ఫినాలే ఎపిసోడ్ ఒకటి చూసా.. నేను ఎప్పుడూ అతనికి ఫోన్ కూడా చేయలేదు. అలాంటిది అతనికి నాకు పెళ్లి అంటూ వార్తలు పుట్టించారు. కొంతమంది యూట్యూబ్ లో మా పెళ్లి కూడా చేశారు. ఆ పెళ్ళికి పెద్ద పెద్ద స్టార్స్ కూడా వచ్చినట్టు వీడియోలు చేశారు అని చెప్పుకొచ్చింది బర్రెలక్క. సోషల్ మీడియాలో లైకులు కోసం వ్యూస్ కోసం ఇంత దిగజారుతారా..? ఇజ్జత్ తీస్తారా..? ఎవరి జీవితం నాశనమైన పట్టించుకోరా.? ఇలా తప్పుడు వార్తలు ఎలా పుట్టిస్తారు.? నేను చాలా వీడియోల్లో ప్రశాంత్ ను అన్న అని పిలిచాను. అలాంటిది నాకు అతనికి పెళ్లి అంటూ తప్పుడు వార్తలు సృష్టిస్తారా..? అంటూ ఫైర్ అయ్యింది బర్రెలక్క.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.