Meera Chopra: పెళ్లి పీటలెక్కిన టాలీవుడ్ హీరోయిన్.. ప్రియుడిని పెళ్లాడిన భామ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. బంగారం సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. ఆ తర్వాత ఏం ఎస్ రాజు దర్శకత్వంలో వచ్చిన వాన సినిమాతో మంచి మరోసారి ప్రేక్షకులను మెప్పించింది. ఆతర్వాత మరో, గ్రీకు వీరుడు సినిమాల్లో నటించి అలరించింది. ఆతర్వాత టాలీవుడ్ కు దూరం అయ్యింది.

Meera Chopra: పెళ్లి పీటలెక్కిన టాలీవుడ్ హీరోయిన్.. ప్రియుడిని పెళ్లాడిన భామ
Meera Chopra

Updated on: Mar 12, 2024 | 8:22 PM

మీరాచోప్రా.. ఈ చిన్నది టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే.. ఈ చిన్నది తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. బంగారం సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. ఆ తర్వాత ఏం ఎస్ రాజు దర్శకత్వంలో వచ్చిన వాన సినిమాతో మంచి మరోసారి ప్రేక్షకులను మెప్పించింది. ఆతర్వాత మరో, గ్రీకు వీరుడు సినిమాల్లో నటించి అలరించింది. ఆతర్వాత టాలీవుడ్ కు దూరం అయ్యింది. బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా, మన్నారా చోప్రా లు మీరా చోప్రా బంధువులు. తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలో దాదాపు 30 సినిమాలు నటించింది.

ఇక ఈ అమ్మడు పెళ్లి చేసుకొని వివాహబంధంలోకి అడుగు పెట్టింది. తాజాగా మీరా చోప్రా తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అభిమానులు మీరాకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. రాజస్థాన్ లోని జైపూర్‌లో ఈ అమ్మడి వెడ్డింగ్ గ్రాండ్ గా జరిగింది.

ప్రియుడు రక్షిత్ ను వివాహం చేసుకుంది మీరా. గత ఏడాది క్రిస్ మస్ సందర్భంగా తన ప్రియుడిని పరిచయం చేసింది మీరా.. ఇక మీరా చోప్రా సినిమాల విషయానికొస్తే ఆమె చివరిగా 2019లో సెక్షన్‌ 375 చిత్రం ద్వారా మెప్పించింది. సఫేద్‌ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఈ చిన్నదాని వయసు 40 ఏళ్లు. ఈ వయసులో మీరా పెళ్లి చేసుకొని హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ అమ్మడి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మీరా చోప్రా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.