Bheemla Nayak: ఆ స్టార్ హీరో కళ్యాణ్ పై బండ్ల గణేశ్ ఆసక్తికర ట్వీట్.. చరిత్ర కోసం మీరు కాదంటూ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటించిన భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమా శుక్రవారం విడుదలైంది. నిన్నటి నుంచి థియేటర్ల వద్ద

Bheemla Nayak: ఆ స్టార్ హీరో  కళ్యాణ్ పై బండ్ల గణేశ్ ఆసక్తికర ట్వీట్.. చరిత్ర కోసం మీరు కాదంటూ..
Pawan

Updated on: Feb 25, 2022 | 5:45 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటించిన భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమా శుక్రవారం విడుదలైంది. నిన్నటి నుంచి థియేటర్ల వద్ద పవన్ ఫ్యాన్స్ రచ్చ షూరు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇవాళ విడుదలైన భీమ్లా నాయక్ సినిమా అదిరిపోయిందని.. బాక్సాఫీస్ హిట్ కావడమంటూ సోషల్ మీడియాలో పవన్ హవా నడుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమా అంటే బండ్ల గణేష్ హడావిడి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. పవన్ పై ఆయన తనదైన స్టైల్లో ప్రశంసలు కురిపిస్తుంటారు. బండ్ల గణేశ్ ఇచ్చే స్పీచ్‏లకు పవన్ అభిమానులు ఫిదా అవుతుంటారు. అయితే గత కొద్ది రోజులుగా భీమ్లా నాయక్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గురించి ఆయన చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అయితే బండ్ల గణేశ్.. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు ఎందుకు రాలేదు అనేది మాత్రం తెలియరాలేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈరోజు భీమ్లా నాయక్ విడుదలైన సందర్భంగా.. పవన్ పై.. భీమ్లా నాయక్ సినిమా పై బండ్ల గణేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ” మా దేవర నటించిన భీమ్లా నాయక్ దెబ్బకి బాక్సులు బద్దలవ్వాలని రికార్డులు చిరిగిపోవాలని దిక్కులు పిక్కటిల్లేలా అభిమానులు స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ..చరిత్ర కోసం మీరు కాదు. మీ కోసం చరిత్ర దేవర ” అంటూ చిరుతపులి ఎమోజీలను షేర్ చేశారు.

ట్వీట్..

భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్‏తోపాటు.. రానా దగ్గుబాటి, నిత్యామీనన్, సంయుక్త మీనన్ కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రానికి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించగా..త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కోషియం సినిమాకు తెలుగు రీమేక్‏గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. అహంకారి అయిన సైనికాధికారికి, ఆత్మ గౌరవం ఉన్న పోలీసు అధికారికి మధ్య జరిగిన యుద్ధమే భీమ్లా నాయక్ స్టోరీ. ఈ సినిమా మ‌న‌వాళ్లకు న‌చ్చేలా చేయ‌డానికి యూనిట్ చాలానే క‌ష్టప‌డింది.

Also Read: Bheemla Nayak Review: స‌మ్మర్ సినిమాల‌కు శుభారంభం.. భీమ్లా నాయ‌క్‌.. పర్‌ఫెక్ట్‌ మూవీ రివ్యూ..

Ram gopal Varma: ‘భీమ్లా నాయక్‌ ఒక భూకంపం.. హిందీలో విడుదల చేయాల్సిందే’.. ఆర్జీవీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్..

Bheemla Nayak: భీమ్లా నాయక్‌ సినిమాపై స్పందించిన చంద్రబాబు, లోకేష్‌.. ఏమన్నారంటే..

Viral Photo: ఇతడి డైలాగ్ గర్జనలా ఉంటుంది.. ఫైట్ యుద్ధంలా ఉంటుంది.. ఎవరో గుర్తించారా