
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీలో బాలయ్యకు జోడీగా శ్రుతిహాసన్ , హనీ రోజ్ నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ నందమరి ఫ్యాన్స్ ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదలైంది. సినిమా రిలీజ్ కంటే ముందే విడుదలైన ‘వీరసింహారెడ్డి’ చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభావాలు.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఇక ఈ సినిమా మొదటి రోజునుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా విడుదలై 5 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటికి ఎంత వసూల్ చేసిందంటే.. నైజాం 13.58 కోట్లు, సీడెడ్ 13.47 కోట్లు, ఉత్తరాంధ్ర 5.11 కోట్లు, ఈస్ట్ 3.96 కోట్లు, వెస్ట్ 3.21 కోట్లు, గుంటూరు 5.24 కోట్లు, కృష్ణా 3.46 కోట్లు, నెల్లూరు 2.13 కోట్లు, ఏపీ + తెలంగాణ కలిపి 50.16 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 3.98 కోట్లు, ఓవర్సీస్ 3.98 కోట్లు, వరల్డ్ వైడ్ 59.32 కోట్లు (షేర్) వసూల్ చేసింది.
ఇక ఈ సినిమా ఇప్పటికి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.59.32 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.8.68 కోట్ల షేర్ ను రాబట్టాలి.