అన్ స్టాపబుల్ షో ఇండియాలోనే టాప్ టాక్ షోగా దూసుకుపోతుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగానే కాదు.. టాక్ షోతో కూడా రాణిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో బాలయ్య చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ మూడు సీజన్స్ పూర్తి చేసుకొని నాలుగో సీజన్స్ దూసుకుపోతుంది. అన్ స్టాపబుల్ సీజన్ 4లో చాలా మంది స్టార్ నటీనటులు గెస్ట్ గా హాజరయ్యారు. రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలయ్య అడిగే ప్రశ్నలకు.. వెంకటేష్ సరదా సమాదానాలు చెప్పారు. అలాగే ఈ ఎపిసోడ్ లో అనిల్ రాఘవపూడి కూడా ఈ టాక్ షోలో సందడి చేశారు. ఇక ఇప్పుడు ఆన్ స్టాపబుల్ షోకి మరో స్టార్ హీరో హీరో కూడా హాజరుకానున్నారు.
ఆన్ స్టాపబుల్ షోకి ఈసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా హాజరుకానున్నారు. రామ్ చరణ్ బాలయ్య షోకు హాజరు కానున్నారు. గతంలో ప్రభాస్ గెస్ట్ గా హాజరయినప్పుడు బాలకృష్ణ చరణ్ తో ఫోన్లో మాట్లాడారు. నా షోకు ఎప్పుడొస్తావ్ అని బాలయ్య అడగ్గా మీరు పిలవడమే లేటు అని చరణ్ అన్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. అన్ స్టాపబుల్ షోలో బాలయ్య తో రామ్ చరణ్ సందడి చేయనున్నారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ రేపు( డిసెంబర్ 31)న జరగనుంది.
ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. జనవరి 10న గేమ్ ఛేంజర్ సినిమా విడుదలకానుంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో సునీల్, ఎస్ జే సూర్య, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ బాలయ్య షోకు హాజరుకానున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.