Balakrishna : బాలయ్యబాబు ఒక్క ఫైట్ కూడా చేయకుండా హిట్ కొట్టిన సినిమా ఎదో తెలుసా..?

|

May 11, 2022 | 4:05 PM

నటసింహం నందమూరి బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా అంటే అదిరిపోయే డైలాగులు.. ఒళ్ళు జలదరించే ఫైట్స్ గుర్తొస్తాయి.

Balakrishna : బాలయ్యబాబు ఒక్క ఫైట్ కూడా చేయకుండా హిట్ కొట్టిన సినిమా ఎదో తెలుసా..?
Balakrishna
Follow us on

నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా అంటే అదిరిపోయే డైలాగులు.. ఒళ్ళు జలదరించే ఫైట్స్ గుర్తొస్తాయి. బాలయ్య అలా పవర్ఫుల్ గా నిలుచొని విలన్ ని కోపంగా చూస్తే చాలు థియేటర్స్ దద్ధరిల్లి పోతాయి. బాలయ్య సినిమా వస్తుందంటే అభిమానుల్లో అంచనాలు మాములుగా ఉండవు. రీసెంట్ గా వచ్చిన అఖండ సినిమా అందుకు పర్ఫెక్ట్ ఉదాహరణ. బోయపాటి తెరకెక్కించిన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. అలాగే ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న సినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్టైనరే.. అయితే బాలకృష్ణ నటించిన సినిమాల్లో ఒక్క ఫైట్ కూడా లేకుండా ఉన్న సినిమా ఎదో మీకు తెలుసా.. ఒక్క యాక్షన్ సీన్ కూడా లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు బాలకృష్ణ.

నందమూరి బాలకృష్ణ ఇప్పటివరకు 106 సినిమాల్లో నటించారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ.. అభిమానులను ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో బాలకృష్ణ నటించిన నారి నారి నడుమ మురారి సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. 1990లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాలకృష్ణ సరసన శోభన, నిరోషా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఒక ఫైట్ కూడా ఉండదు. కనీసం డ్యాన్స్ మూమెంట్స్ కూడా ఉండవు. కేవలం బాలకృష్ణ నటన, కథ కారణంగా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికి ఈ సినిమా టీవీలో టెలికాస్ట్ అయితే ప్రేక్షకులు ఇంట్రస్టింగ్ గా చూస్తుంటారు. ఇలా ఒక్క ఫైట్ సీన్ కూడా లేకుండా బాలయ్య బ్లాక్ బస్టర్  ను అందుకున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Upasana Konidela: ఉపాసన కొణిదెలకు కోవిడ్ పాజిటివ్.. మానసికంగా ధైర్యంగా ఉన్నానంటూ పోస్ట్..

Sarkaru Vaari Paata First Review: సర్కారు వారి పాట ఫస్ట్ రివ్యూ.. స్క్రీన్ పై సింహాంలా గర్జించిన మహేష్..

Viral Photo: పున్నమి వెన్నెల లాంటి నవ్వు.. రెండు జడల గులాబీ చిన్నారి.. కుర్రాళ్ళని తన మాయలో ముంచేసింది.. గుర్తుపట్టండి..

ఇవి కూడా చదవండి