Sudheer Babu: మరో ఇంట్రస్టింగ్ సినిమాతో రాబోతున్న యంగ్ హీరో సుధీర్ బాబు

యంగ్ హీరో సుధీర్ బాబు సినిమా అంటే ప్రేక్షకుల్లో ఓ ఇంట్రస్టింగ్ ఉంటుంది. కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు ఈ కుర్ర హీరో.

Sudheer Babu: మరో ఇంట్రస్టింగ్ సినిమాతో రాబోతున్న యంగ్ హీరో సుధీర్ బాబు
Sudheer Babu .
Follow us

|

Updated on: May 11, 2022 | 4:53 PM

యంగ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu)సినిమా అంటే ప్రేక్షకుల్లో ఓ ఇంట్రస్టింగ్ ఉంటుంది. కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఇటీవలే సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో ప్రేక్షుల ముందుకు వచ్చి మెప్పించాడు. ఇక ఇప్పుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాతో పాటు హర్షవర్ధన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌.ఎల్‌.పి ప్రొడక్షన్ నెం 5గా నారాయణదాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. సోనాలి నారంగ్, సృష్టి సెల్యులాయిడ్ సమర్పిస్తున్న ఈ చిత్రం.. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది.

సుధీర్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇదే సందర్భంలో తన టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్, డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్ తో తెలుగు ప్రేక్షకులనే కాకుండా బాలీవుడ్ ని సైతం ఆకట్టుకున్న సుధీర్ బాబుకు ‘నైట్రో స్టార్’ ట్యాగ్ ఇవ్వబడింది. ఈ చిత్రానికి ”మామా మశ్చీంద్ర’ అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. మశ్చీంద్ర అనే పదానికి .. పవర్ ని కోరుకునేవాడు, ధైర్యవంతుడనే అర్ధాలు వున్నాయి. ఈ టైటిల్ సినిమాలో నైట్రో స్టార్ సుధీర్ బాబు పాత్రని ప్రతిబింబిస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఒక రాక్ స్టార్ లా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు నైట్రో స్టార్ సుధీర్ బాబు. ఈ సినిమాలో సుధీర్ బాబు ఛాలెంజింగ్ రోల్ పోషిస్తున్నారు. దర్శకుడు హర్షవర్ధన్ మునుపెన్నడూ చూడని మల్టీ షేడ్ క్యారెక్టర్‌లో సుధీర్ బాబుని చూపించబోతున్నారు. వినూత్నమైన కాన్సెప్ట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా రూపొందించబడుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో కనిపిస్తుండగా, అత్యున్నత టెక్నికల్ టీం పని చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు చిత్ర యూనిట్ త్వరలోనే వెల్లడించనుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Upasana Konidela: ఉపాసన కొణిదెలకు కోవిడ్ పాజిటివ్.. మానసికంగా ధైర్యంగా ఉన్నానంటూ పోస్ట్..

Sarkaru Vaari Paata First Review: సర్కారు వారి పాట ఫస్ట్ రివ్యూ.. స్క్రీన్ పై సింహాంలా గర్జించిన మహేష్..

Viral Photo: పున్నమి వెన్నెల లాంటి నవ్వు.. రెండు జడల గులాబీ చిన్నారి.. కుర్రాళ్ళని తన మాయలో ముంచేసింది.. గుర్తుపట్టండి..

ఇవి కూడా చదవండి

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు