Balakrishna On Akhanda: నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కిన ” అఖండ మూవీ” బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది. కరోనా(Corona) క్రైసిస్ సమయంలో కూడా అఖండ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కర్నూలులో కృతజ్ఞత సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య.. శివుడు ఆది దేవుడని.. కొంచెం నీరు అభిషేకిస్తే చాలు భక్తులు కోరిన కోర్కెలు తీర్చే భోళాశంకరుడికి నమస్కారం చేశారు. అనంతరం తల్లిదండ్రులను స్మరించుకున్నారు. అఖండ సినిమాను నిర్మించిన నిర్మాతలకు.. శతదినోత్సవ పండగకు వచ్చిన ఫ్యాన్స్ కు అభివందనలు చెప్పారు. అఖండ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. కరోనా సమయంలో కూడా రిలీజై..ఇంతటి ఆదరణను సొంతం చేసుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. సినిమాను ప్రారంభించినప్పుడు ఒక మంచి మనసుతో తీశామని.. ధర్మం జోలికి, పసిపాపల జోలికి వెళ్లరాదనే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా అందించామని చెప్పారు బాలయ్య.
అఖండ మూవీ యావత్ భారతదేశాన్ని తల ఎత్తుకునేలా చేసిందని చెప్పారు. అంతేకాదు హైందవ సనాతన ధర్మాన్ని రక్షించిన..పనుల్లో పడి మరచిపోతున్న సమయంలో మళ్ళీ హైందవ సనాతన ధర్మాన్ని నిలబెట్టిన చిత్రంగా ‘అఖండ’ నిలిచిందని అన్నారు. తన ప్రతి సినిమా ఆలోచన రేకెత్తించేదే అని అన్నారు. భగవంతుడు మనిషికి కష్టకాలంలో ఏదొక రూపంలో వచ్చి ఆడుకుంటానే.. మంచి సందేశాన్ని అందించిన చిత్రం మన అఖండ సినిమా అని చెప్పారు. ఈ సినిమాను తెలుగువారు మాత్రమే కాదని.. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది పొగిడారని.. ఇటువంటి సందేశాత్మక చిత్రాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి.. అవకాశమిచ్చిన భగవంతుడికి కృతఙ్ఞతలు చెప్పారు. ఈ సినిమాకు థమన్ మంచి సంగీతాన్ని అందించారని.. ప్రశంసించారు. బోయపాటి ఎప్పుడూ లెజెండ్, సింహా వంటి చరిత్ర తిరగరాసే సినిమాలనే చేస్తాడని కొనియాడారు. అఖండ సినిమా సినీ పరిశ్రమకు దిక్సూచిగా నిలిచిందని.. తన అభిమానులే తనకు వెలకట్టలేని ఆస్తిని చెప్పారు. అఖండ వంటి సహజమైన సినిమాలతో కరోనా సమయంలో కూడా ఇంతటి భారీ హిట్ సాధించడం చాలా గొప్పదనమని అన్నారు.
Tamilnadu: పొలంలో విషం తిని 12 నెమళ్ళు మృతి.. రైతుని అరెస్ట్ చేసిన పోలీసులు