Nandamuri Balakrishna: జోరుపెంచిన నటసింహం.. డైనమిక్ డైరెక్టర్‌‌‌తో మరో సినిమా ప్లాన్..

|

Jul 24, 2021 | 7:54 PM

నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి సినిమా 'అఖండ'తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ తమిళనాడులో జరుగుతోంది.

Nandamuri Balakrishna: జోరుపెంచిన నటసింహం.. డైనమిక్ డైరెక్టర్‌‌‌తో మరో సినిమా ప్లాన్..
Balakrishana
Follow us on

Nandamuri Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి సినిమా ‘అఖండ’తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ తమిళనాడులో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌‌‌‌తో షూటింగ్‌‌కు గుమ్మడికాయ కొట్టనున్నారు. కుదిరితే దసరాకి ముందుగా, లేదంటే సంక్రాంతి రోజుల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. ఆ దిశగానే మిగతా పనులు జరుగుతున్నాయి. అలాగే ఈ సినిమా తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ చేయనున్నారు. ఇది కూడా భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌‌‌‌గానే రూపొందనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పనులను పూర్తిచేసుకుని గోపీచంద్ మలినేని సిద్ధంగా ఉన్నాడు. ఆ తరువాత ప్రాజెక్టును అనిల్ రావిపూడితో చేయాలని బాలకృష్ణ భావించారు. అయితే బాలకృష్ణ చెప్పిన మార్పులు చేర్పులు చేయడానికి అనిల్‌‌కు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అందువలన పూరి స్పీడ్ గురించి తెలిసిన బాలకృష్ణ, ముందుగా ఆయన ప్రాజెక్టును పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు.

అంటే పూరి సినిమా తరువాతనే అనిల్ రావిపూడి ప్రాజెక్టు ఉంటుందన్న మాట. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘పైసా వసూల్’ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సమయంలోనే బాలయ్యతో మరో సినిమా చేస్తానని పూరి కమిట్ అయ్యారు. ఇక బాలయ్య సై అనాలేగాని గంటల్లో స్టోరీ రెడీ చేసి రోజుల్లో సినిమాను కంప్లీట్ చేస్తారు. దాంతో అనిల్ సినిమా కంటే ముందే పూరి సినిమా వచ్చే అవకాశలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పూరిజగన్నాథ్ విజయ్ దేవరకొండతో లైగర్ అనే సినిమా చేస్తున్నవిషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తికానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ishq: శ్రోతల హృదయాలను తాకుతున్న అందమైన ప్రేమ పాట.. ఇష్క్ నుంచి వీడియో సాంగ్..

Mahesh Babu: నాలుగుపదుల వయసులోనూ నవయువకుడిగా.. మహేష్ అల్ట్రా స్మార్ట్ లుక్

Shilpa Shetty: భర్త రాజ్ కుంద్ర కంపెనీకి శిల్పా శెట్టి రాజీనామా.. డైరెక్టర్ పదవికి రిజైన్ చేసిన బాలీవుడ్ నటి