NBK 108: జెట్ స్పీడ్ లో బాలయ్య సినిమా షూటింగ్.. ప్రజెంట్ ఎక్కడ చిత్రీకరిస్తున్నారంటే..

క్రాక్ సినిమాతో బ్లాక్‌ బస్టర్ అందుకున్న మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'వీరసింహారెడ్డి' చిత్రం సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌‌గా విడుదలైంది. ఇక వీరసింహారెడ్డి విజయంతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

NBK 108: జెట్ స్పీడ్ లో బాలయ్య సినిమా షూటింగ్.. ప్రజెంట్ ఎక్కడ చిత్రీకరిస్తున్నారంటే..
Nandamuri Balakrishna
Follow us

|

Updated on: May 24, 2023 | 8:33 AM

గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా వీరసింహారెడ్డి. క్రాక్ సినిమాతో బ్లాక్‌ బస్టర్ అందుకున్న మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌‌గా విడుదలైంది. ఇక వీరసింహారెడ్డి విజయంతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత  బాలయ్య.. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇటీవలే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది.

వీరసింహారెడ్డి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు అనిల్ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. బాలయ్య.. అనిల్ రావిపూడి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్‎కు ఆసక్తికర టైటిల్ నిర్ణయించారట. ఈ మూవీకి రామారావు గారు అనే టైటిల్ ఫిక్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ప్రస్తుతం డైరెక్టర్ అనిల్  సినిమా షూటింగ్ ను శరవేగంగా చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి.తాజా షెడ్యూల్ హైదరాబాద్ – నానక్ రామ్ గూడా పరిసర ప్రాంతాల్లో ప్లాన్ చేశారు. బాలకృష్ణ, కాజల్ పై కీలక సన్నివేక్షలను చిత్రీకరిస్తున్నారట అనిల్. అఖండ, వీరసింహారెడ్డి సినిమాల తర్వాత తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.