Chiranjeevi – Balakrishna: స్పీడ్ పెంచిన సీనియర్ హీరోలు.. చిరు అలా.. బాలయ్య ఇలా

|

Jan 31, 2023 | 9:31 AM

ఇటీవలే వాల్తేరు వీరయ్యగా ఆడియన్స్‌ ముందుకు వచ్చారు మెగాస్టార్‌.. షార్ట్ గ్యాప్‌లో మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఫిక్స్ అయ్యారు. వింటేజ్‌ చిరును చూపిస్తూ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది వాల్తేరు వీరయ్య.

Chiranjeevi - Balakrishna: స్పీడ్ పెంచిన సీనియర్ హీరోలు.. చిరు అలా.. బాలయ్య ఇలా
Balakrishna , Chiranjeevi
Follow us on

యంగ్ హీరోలు కూడా ఏడాదికి ఒక్క సినిమానే అని ఫిక్స్ అయిన టైమ్‌లో సినిమా మేకింగ్ స్పీడు పెంచుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇటీవలే వాల్తేరు వీరయ్యగా ఆడియన్స్‌ ముందుకు వచ్చారు మెగాస్టార్‌.. షార్ట్ గ్యాప్‌లో మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఫిక్స్ అయ్యారు. వింటేజ్‌ చిరును చూపిస్తూ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది వాల్తేరు వీరయ్య. ఆల్రెడీ మోస్ట్‌ అవెయిటెడ్ లిస్ట్‌లో ఉన్న వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో అప్‌ కమింగ్ సినిమాల విషయంలోనూ అదే హైప్‌ క్రియేట్ అవుతోంది.

కోలీవుడ్ బ్లాక్ బస్టర్‌ వేదలంను భోళా శంకర్‌ పేరుతో రీమేక్ చేస్తున్నారు చిరు. రీసెంట్‌గా రీమేక్ మూవీ గాడ్‌ ఫాదర్‌తో సూపర్ హిట్ అందుకున్న మెగాస్టార్‌ భోళా శంకర్‌తో మరోసారి అదే ఫీట్ రిపీట్ చేస్తారని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు ఫ్యాన్స్‌. అందుకే మెగా మూవీ కోసం మరింత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు హీరో నందమూరి బాలకృష్ణ. అఖండగా చరిత్ర సృష్టించిన బాలయ్య రీసెంట్ గా వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మాస్ స్పెషలిస్ట్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

బ్యాక్‌ టు బ్యాక్ మాస్ ఎంటర్‌టైనర్స్‌ చేస్తున్న బాలయ్య.. జస్ట్ ఫర్‌ ఏ చేంజ్‌ అన్నట్టుగా ఓ కామెడీ డైరెక్టర్‌ను లైన్‌లో పెట్టారు. కామెడీ సినిమాను కమర్షియల్ బ్లాక్ బస్టర్‌గా నిలబెట్టే సత్తా ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ చేశారు బాలయ్య. నెక్ట్స్ ఇయర్ మోస్ట్ అవెయిటెడ్ లిస్ట్‌లో టాప్‌లో కనిపిస్తోంది ఎన్బీకే 108. ఇలా మెగా, నందమూరి హీరోలు ప్రేక్షలులను అలరించడానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రెడీ అయిపోయారు.