Akhanda: నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండ.. కరోనా తర్వాత గ్రాండ్ గా రిలీజ్ అయిన సినిమా బాలయ్య అఖండ. ఈ సినిమా ఊహించని రీతిలో విజయాన్ని సాంతం చేసుకొని కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ఇది. సింహ , లెజెండ్ సినిమాలను మించి అఖండ .. అఖండ విజయం సాధించింది. రోజులు గడుస్తున్నా థియేటర్స్ ముందు హౌస్ ఫుల్ బోర్డులు మాత్రం తీయడం లేదు ఓనర్స్.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర దేశాల్లోనూ అఖండ జాతర జరుగుతుంది అంటున్నారు బాలయ్య అభిమానులు. కెరీర్‌లో తొలిసారి 100 కోట్ల మార్క్‌ను అందుకున్నాడు. బోయపాటి ఇచ్చిన మాస్ స్ట్రోక్‌కు.. ఒక్క బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. అందుకే అఖండ విజయాన్ని కట్టబెట్టారు.
రాష్ట్రాలలో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ వెళుతోంది. ముఖ్యంగా నైజామ్ లో ఈ సినిమా 11 రోజుల్లో 17.36 కోట్ల షేర్ ను రాబట్టిందని అంటున్నారు. నైజామ్ లో ఈ సినిమా 10.50 కోట్ల బిజినెస్ ను జరుపుకోగా, నిన్నటివరకూ రాబట్టిన షేర్ 17.36 కోట్లని వెల్లడించారు. రెమ్యూనరేషన్స్ కలుపుకుని ఈ మూవీకి రూ. 53 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే 8 రోజుల్లోనే టార్గెట్ కంప్లీట్ చేసి.. బ్రేక్ ఈవెన్‌లోకి దూసుకెళ్లింది అఖండ. ఇక ఏపీలో బెనిఫిట్ షోలపై, టికెట్ రేట్లపై నియంత్రణ ఉంది కానీ.. లేదంటే కథ వేరేలా ఉండేది అన్నది బాలయ్య ఫ్యాన్స్ వెర్షన్. మొత్తం మీద బాలయ్య ‘అఖండ’తో సింహనాదం చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :