బాలయ్య అభిమానులకు ఊహించని షాక్.. అఖండ 2 ప్రీమియర్స్ రద్దు..

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యూయెల్ రోల్ లో నటించారు. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్స్, ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.

బాలయ్య అభిమానులకు ఊహించని షాక్..  అఖండ 2 ప్రీమియర్స్ రద్దు..
Akhanda 2

Updated on: Dec 04, 2025 | 6:43 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా రేపు గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ ఈ లోగా సినిమాకు ఊహించని షాక్ తగిలింది. అఖండ 2 ప్రీమియర్స్ రద్దు అయ్యాయి. ఈమేరకు మేకర్స్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంపుకు అనుమతి ఇచ్చింది. ప్రీమియర్స్ కు రూ. 600 సింగిల్ స్క్రీన్ రూ. 50, మల్టీప్లక్స్ రూ. 100 రూపాయిలు పెంచింది. కాగా ఇప్పుడు ప్రీమియర్స్ రద్దు అని నిర్మాతలు తెలపడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

అఖండ 2 ప్రీమియర్లు రద్దు అంటూ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అనౌన్స్ చేసింది. ఈరోజు జరగాల్సిన అఖండ2 ప్రీమియర్లు సాంకేతిక సమస్యల కారణంగా రద్దు చేయబడ్డాయి. మేము మా శాయశక్తులా ప్రయత్నించాము, కానీ కొన్ని విషయాలు మా నియంత్రణలో లేవు. అసౌకర్యానికి క్షమించండి. అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు మేకర్స్. దాంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అఖండ 2 సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యూయెల్ రోల్ లో నటించారు. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్స్, ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూడు బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. సింహ, లెజెండ్, అఖండ ఈ మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి. ఇక ఇప్పుడు అఖండ 2 సినిమాతో రాబోతున్నారు బాలకృష్ణ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .