Balagam: హైదరాబాద్‌ నిమ్స్‌లో చేరిన ‘బలగం’ సింగర్‌ మొగిలయ్య.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

|

Apr 12, 2023 | 8:26 AM

ఇప్పటికే కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న మొగిలయ్యకు గుండెపోటు వచ్చినట్లు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి మొగిలయ్యను వరంగల్‌ ఆస్పత్రి నుంచి హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఏఆర్సీయూ లో చికిత్స అందిస్తున్నారు. కిడ్నీ సమస్యలతో పాటు గుండె సంబంధిత వ్యాధితో..

Balagam: హైదరాబాద్‌ నిమ్స్‌లో చేరిన బలగం సింగర్‌ మొగిలయ్య.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
Balagam Singer Mogulaiah
Follow us on

వేణు యెల్దండి దర్శకత్వం వహించిన బలగం సినిమాలోని క్లైమాక్స్‌ సాంగ్‌ ‘తోడుగా మాతో ఉండి’ పాటను అద్భుతంగా ఆలపించి బుడగ జంగాల కళాకారుడు మొగిలయ్య మంగళవారం (ఏప్రిల్‌ 11) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికే కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న మొగిలయ్యకు గుండెపోటు వచ్చినట్లు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి మొగిలయ్యను వరంగల్‌ ఆస్పత్రి నుంచి హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఏఆర్సీయూ లో చికిత్స అందిస్తున్నారు. కిడ్నీ సమస్యలతో పాటు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నమొగిలయ్య ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా అంతకుముందు మొగిలయ్య ఆరోగ్య పరిస్థితిపై మంత్రులు హరీశ్‌ రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందించారు. ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే మొగిలయ్యను వ‌రంగ‌ల్ నుంచి హైద‌రాబాద్‌కు త‌ర‌లించాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు మంత్రి హరీశ్‌రావు.

కాగా రెండేళ్ల క్రితం కరోనా బారిన పడ్డారు సింగర్ మొగిలయ్య. ఆతర్వాత కిడ్నీలు కూడా ఫెయిల్‌ అయ్యాయి. వీటికి తోడు బీపీ, షుగర్‌ లాంటి దీర్ఘ కాలిక వ్యాధులు కూడా ఆయనను చుట్టుముట్టాయి. కంటి చూపు కూడా మందగించింది. చికిత్సలో భాగంగావారానికి మూడు సార్లు వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. అయితే డయాలసిస్‌, వరంగల్‌ రాకపోకలకు, మెడిసిన్స్‌.. ఇలా ఖర్చులు తడిసిమోపెడువుతున్నాయి. బుర్రకథలు చెప్పి పొట్ట నింపుకునే మొగిలయ్య- కొమురమ్మ దంపుతలకు ఈ ఖర్చులు పెను భారంగా మారాయి. అందుకే మనసున్న మారాజులు, ప్రభుత్వం తన భర్తను ఆదుకోవాలంటూ దీనంగా వేడుకుంటోంది కొమురమ్మ.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..