Balagam Trailer Review : ఆసక్తికరంగా ‘బలగం’ ట్రైలర్.. బలమైన ఎమోషన్స్‏తో తెలంగాణ జీవనచిత్రం..

ఇందులో డైరెక్టర్ వేణు టైలర్ నర్సి పాత్రలో కనిపించాడు. ఇక ప్రియదర్శి, కావ్య ప్రేమకథతోపాటు.. ఆ గ్రామంలోని మనషులు, కుటుంబాల మధ్య రిలేషన్స్ షిప్స్, కోపతాపాలను ట్రైలర్ లో చూచాయగా చూపించారు.

Balagam Trailer Review : ఆసక్తికరంగా బలగం ట్రైలర్.. బలమైన ఎమోషన్స్‏తో తెలంగాణ జీవనచిత్రం..
Balagam Trailer

Updated on: Feb 28, 2023 | 6:48 AM

ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి నిర్మాతగా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న చిత్రం బలగం. ఈ సినిమాతో ప్రముఖ కమెడియన్ వేణి ఎల్దండి దర్శకుడిగా పరిచయమవుతుండగా.. ఇందులో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రధారులుగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్నా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకునే విధంగా సాగింది. కొమురయ్య అనే ముసలాయన పాత్రతో ట్రైలర్ మొదలు కాగా.. ఇందులో డైరెక్టర్ వేణు టైలర్ నర్సి పాత్రలో కనిపించాడు. ఇక ప్రియదర్శి, కావ్య ప్రేమకథతోపాటు.. ఆ గ్రామంలోని మనషులు, కుటుంబాల మధ్య రిలేషన్స్ షిప్స్, కోపతాపాలను ట్రైలర్ లో చూచాయగా చూపించారు.

ఎవ్వని స్వార్థం వాడే చూసుకుంటుండు కదరా అని చెప్పే డైలాగ్ ఆలోచింపజేస్తుంది. మరోవైపు ప్రియదర్శి పెళ్లి కష్టాలను కూడా కామెడీ మిక్స్ చేసి చూపించగా.. భీమ్స్ సిసిరోలియే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. అచ్చమైన తెలంగాణ మట్టి మనుషుల్లో ఉండే అన్ని రకాల ఎమోషన్స్ ను క్యాప్చర్ చేసే ప్రయత్నం చేసారు. చివరలో కొమురయ్య మరణంతోనే ఈ బలగం కథ మలుపు తిరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమా మార్చి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.