బలగం సినిమాలో పెద్దగా సీన్లు పడకపోయినా.. స్క్రీన్ స్పేస్ దక్కకపోయినా.. తన సిగ్గుతో.. ఇన్నోసెంట్ యాక్టింగ్‌తో అందర్నీ ఆకట్టుకున్నారు సౌధామని. ఆకట్టుకోవడమే కాదు.. ఉన్నంత సేపు అందరి చూపులను తన వైపే తిప్పుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టు అవ్వడంతో.. దిమ్మ తిరిగే ఆఫర్ పట్టేశారు. ఏకంగా ఓ స్టార్ డైరెక్టర్ సినిమాలో కీ రోల్ కొట్టేశారు.
సినిమాల్లో నటించాలనే కోరికతో.. టాలీవుడ్ లో ఆర్టిస్టుగా రాణించాలనే ఆశతో.. ఉన్న సౌధామిని.. బలగం సినిమాలో తనొకచ్చిన అవకాశాన్ని పర్ఫెక్ట్ గా యుటిలైజ్ చేసుకున్నారు. ఇన్నోసెంట్ అమ్మాయి పాత్రలో సిగ్గు పడుతూ.. అందర్నీ ఆకట్టుకున్నారు. ఆ క్యారెక్టర్ కోసం డైరెక్టర్ చెప్పారని పది కిలోలు వెయిట్ కూడా పెరిగారు. తనకు దొరికిన ఆ చిన్న రోల్లో మనసు పెట్టి మరీ యాక్ట్ చేశారు. ఇక అందుకే అన్నట్టు .. తాజాగా ఈ బ్యూటీ జాతి రత్నాలు డైరెక్టర్ నుంచి నేరుగా ఆఫర్ వచ్చేలా చేసుకున్నారు.
జాతి రత్నాలు సినిమాతోనే స్టార్ ఇమేజ్ వచ్చేలా చేసుకున్న అనుదీప్.. తాజాగా బలగం ఫేమ్ సౌధామినికి కాల్ చేసి అప్రిషియేట్ చేశారట. అప్రిషియేట్ చేయడమే కాదు.. తన నెక్ట్స్ సినిమాలో.. ఓ కీ రీల్ ఇస్తానని కూడా మాటిచ్చారట. ఇక ఇదే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్య్యూలో తనే చెప్పారు. ఇప్పుడీ మాటలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.