Vijayendra Prasad Puri: బాహుబ‌లి ర‌చ‌యిత మొబైల్ వాల్‌పేప‌ర్‌పై ద‌ర్శ‌కుడు పూరి ఫొటో.. కార‌ణ‌మేంటో తెలుసా.?

Vijayendra Prasad Puri Jagannadh: తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో అప‌జ‌య‌మంటూ ఎర‌గ‌ని ద‌ర్శ‌కుడు ఎవ‌రైనా ఉన్నారా అంటే.. రాజ‌మౌళి అనే స‌మాధానం ట‌క్కున వ‌స్తుంది. రాజ‌మౌళి ఇప్ప‌టి వ‌ర‌కు తీసిన సినిమాలన్నీ...

Vijayendra Prasad Puri: బాహుబ‌లి ర‌చ‌యిత మొబైల్ వాల్‌పేప‌ర్‌పై ద‌ర్శ‌కుడు పూరి ఫొటో.. కార‌ణ‌మేంటో తెలుసా.?
Puri Vijayendra Prasad

Updated on: May 28, 2021 | 4:14 PM

Vijayendra Prasad Puri Jagannadh: తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో అప‌జ‌య‌మంటూ ఎర‌గ‌ని ద‌ర్శ‌కుడు ఎవ‌రైనా ఉన్నారా అంటే.. రాజ‌మౌళి అనే స‌మాధానం ట‌క్కున వ‌స్తుంది. రాజ‌మౌళి ఇప్ప‌టి వ‌ర‌కు తీసిన సినిమాలన్నీ సంచ‌ల‌న విజ‌యాలు అందుకున్నాయి. ఇక రాజ‌మౌళి తెర‌కెక్కించిన దాదాపు అన్ని చిత్రాల‌కు క‌థ‌ను త‌న తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ అందించిన విష‌యం తెలిసిందే. బాహుబ‌లి చిత్రంతో ఒక్క‌సారిగా దేశం దృష్టిని ఆక‌ర్షించారు విజ‌యేంద్ర ప్ర‌సాద్‌. ఈ సినిమా త‌ర్వాత ప‌లు బాలీవుడ్ చిత్రాల‌కు సైతం క‌థ‌ను అందించారు.
త‌న కుమారుడు దేశంలోనే అగ్ర ద‌ర్శ‌కుల్లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్నారు.. మ‌రి రాజ‌మౌళి కాకుండా విజ‌యేంద్ర ప్ర‌సాద్‌కు ఇష్ట‌మైన ద‌ర్శ‌కుడు ఎవ‌రో తెలుసా? ఇటీవ‌ల న‌టుడు అలీతో జ‌రిగిన ఓ ఇంట‌ర్వ్యూలో ఈ ప్ర‌శ్న‌కు స్పందించిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌.. త‌న ఫేవ‌రేట్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ అని చెప్పారు. అంత‌టితో ఆగ‌కుండా పూరీ అంటే నాకు అసూయ అని తెలిపిన స్టార్ రైట‌ర్‌.. త‌న శత్రువును (పూరీ జ‌గ‌న్నాథ్‌) ప్రతిరోజూ చూడాలని ఆయన ఫొటో నా ఫోన్ లో వాల్ పేపర్ గా పెట్టుకున్నాను అని నవ్వుతూ చెప్పారు విజ‌యేంద్ర ప్ర‌సాద్. ఇదిలా ఉంటే గ‌తంలోనూ ఓ ఇంట‌ర్వ్యూలో విజ‌యేంద్ర ప్ర‌సాద్ పూరీ జ‌గ‌న్నాథ్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. అత్యంత త‌క్కువ స‌మ‌యంలో భారీ సినిమాలు తీయ‌డం కేవ‌లం పూరీకే సాధ్య‌మ‌ని చెప్పుకొచ్చారు. ఇక ఫైటింగ్ సన్నివేశాలు పూరీలా తీయడం రాజ‌మౌళికి, త‌న‌కు రాద‌ని.. నేర్చుకుంటున్నాన‌ని తెలిపారు విజ‌యేంద్ర ప్ర‌సాద్‌.

Also Read: Sushanth Singh: సుశాంత్ సింగ్ మృతి కేసులో మ‌రో వ్య‌క్తి అరెస్ట్.. సుశాంత్ చివ‌రిగా మాట్లాడింది ఈ వ్య‌క్తితోనే..

kalyan ram: మగధ రాజ్యాధిపతి బింబిసారుడిగా నందమూరి కళ్యాణ్ రామ్.. ‘బింబిసార’ మూవీ మోషన్ పోస్టర్..

koratala siva: కొరటాల శివకు షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. అదే నా విజయం అంటూ రిప్లై.. ..