త‌న కొడుక్కి రాజ‌మౌళి పేరు పెట్టుకున్న ఆ న‌టుడెవ‌రో తెలుసా..

తెలుగు సినీ పరిశ్రమ రేంజ్ ని మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్లారు ద‌ర్శ‌కుడు రాజమౌళి. బాహుబలి సిరీస్‌తో ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ ఐకాన్ గా మారారు. తెలుగ‌వాడి ఖ్యాతిని ద‌శ‌దిశ‌లా ఇనుమ‌డింప‌జేశారు. ద‌ర్శ‌కుడిగా ఆయ‌న ఎదుగుతూనే ఎంద‌రో న‌టుల‌కు లైఫ్ ఇచ్చారు. అందులో ఒకరే ‘బాహుబలి ఫేమ్ ప్ర‌భాక‌ర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్ర‌భాక‌ర్.. రాజమౌళి గొప్ప‌త‌నం గురించి ముచ్చటించారు. జ‌క్క‌న్న వల్లే ఈ రోజు తాను, తన ఫ్యామిలీ సంతోషంగా ఉన్నామని లేదంటే తమ […]

త‌న కొడుక్కి రాజ‌మౌళి పేరు పెట్టుకున్న ఆ న‌టుడెవ‌రో తెలుసా..

Updated on: May 15, 2020 | 10:26 PM

తెలుగు సినీ పరిశ్రమ రేంజ్ ని మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్లారు ద‌ర్శ‌కుడు రాజమౌళి. బాహుబలి సిరీస్‌తో ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ ఐకాన్ గా మారారు. తెలుగ‌వాడి ఖ్యాతిని ద‌శ‌దిశ‌లా ఇనుమ‌డింప‌జేశారు. ద‌ర్శ‌కుడిగా ఆయ‌న ఎదుగుతూనే ఎంద‌రో న‌టుల‌కు లైఫ్ ఇచ్చారు. అందులో ఒకరే ‘బాహుబలి ఫేమ్ ప్ర‌భాక‌ర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్ర‌భాక‌ర్.. రాజమౌళి గొప్ప‌త‌నం గురించి ముచ్చటించారు.

జ‌క్క‌న్న వల్లే ఈ రోజు తాను, తన ఫ్యామిలీ సంతోషంగా ఉన్నామని లేదంటే తమ పరిస్థితి భ‌యాన‌కంగా ఉండేద‌ని ప్రభాకర్ అన్నారు. ఫ‌స్ట్ టైమ్ ‘మర్యాద రామన్న’ సినిమాకు సెలెక్ట్ అయినప్పుడు తనకు డైలాగ్ చెప్ప‌డం కూడా రాదని, రాజమౌళి గారు సొంతంగా డ‌బ్బులు ఇచ్చి న‌ట‌న‌లో మెలుకువ‌లు నేర్పించార‌ని అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు ప్రభాకర్. ఆ తర్వాత ‘బాహుబలి’ మూవీలో ఛాన్స్ ఇచ్చి త‌న‌కు ఫేమ్ ఇచ్చి దేవుడ‌య్యార‌ని చెప్పుకొచ్చాడు. ‘మర్యాద రామన్న’, ‘బాహుబలి’ సినిమాల కంటే ముందు పూర్తి అప్పుల్లో కూరుకుపోయాన‌ని.. ఈ రెండు సినిమాలే త‌న జీవితాన్ని నిల‌బెట్టాయ‌ని తెలిపారు. అందుకే త‌న కొడుక్కి కూడా రాజ‌మౌళి అనే పేరు పెట్టుకున్నారు ప్ర‌భాక‌ర్.