Babu Mohan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బాబుమోహన్.. ఏమన్నారంటే..

|

Oct 01, 2021 | 3:35 PM

పవన్ వర్సెస్ పోసాని ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతుంది.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అటు ఏపీలో ఇటు సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి.

Babu Mohan:  పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బాబుమోహన్.. ఏమన్నారంటే..
Babu Mohan
Follow us on

Babu Mohan: పవన్ వర్సెస్ పోసాని ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతుంది.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అటు ఏపీలో ఇటు సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులను తీవ్రస్థాయిలో విరామర్శించిన విషయం తెలిసిందే.. దాంతో ఏపీ మంత్రులు పవన్‌కు కౌంటర్లు ఇస్తున్నారు. రిపబ్లిక్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఈవెంట్‌ నుంచి ఎన్నో ట్విస్ట్‌లు, మరెన్నో టర్నింగ్‌లు. పోసాని కామెంట్లు, ఆ తర్వాత జనసైనికుల రియాక్షన్‌ మరింత హీట్‌ పెంచేస్తోంది. విషయం కేసుల వరకూ వెళ్లింది. పవన్ ఫ్యాన్స్ అడ్డుకునేందుకు ప్రయత్నించడంపై ఘాటుగానే రియాక్ట్ అయ్యారు పోసాని. తనకు ఏం జరిగినా పవన్‌దే బాధ్యతన్నారు… ఆ తర్వాత సీన్‌ మంగళగిరికి షిఫ్ట్ అయింది. జనసేన విస్తృతస్థాయి సమావేశం. ఈ మీటింగ్‌లోనే గబ్బర్ సింగ్ గన్‌లోంచి బుల్లెట్లలా దూసుకొచ్చాయి మాటల తూటాలు. యుద్ధానికి సిద్ధం అంటూ సవాల్ విసిరారు సేనాని. ఎవరినీ వదిలేదని లేదని హెచ్చరించారు…

మళ్లీ సీన్ హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది..సోమాజిగూడ్‌ ప్రెస్‌క్లబ్‌ దగ్గర ఎపిసోడ్‌కి కంటిన్యూగా పోసాని కృష్ణమురళీ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. హైదరాబాద్‌ ఎల్లారెడ్డిగూడలోని ఆయన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఇటుక రాళ్లు విసిరేశారు. అయితే 8 నెలల నుంచి పోసాని కుటుంబం మరో చోట ఉంటోంది. దాడి జరిగిన ఇంట్లో వాచ్‌మన్‌ ఫ్యామిలీ కాపలాగా ఉంటోంది. దాడి టైమ్‌లో వాచ్‌మన్‌ దంపతులు ఇద్దరూ బయటే నిద్రపోయారు. గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి అరుస్తున్నప్పుడు లేచి పరుగులు పెట్టారు. ఆలోపే ఇటుక రాళ్లను పోసాని ఇంట్లోకి విసిరేశారు గుర్తు తెలియని వ్యక్తులు.

ఇదిలా ఉంటే తాజాగా పవన్ వ్యాఖ్యల మీద సీనియర్ నటుడు బాబూ మోహన్ ఘాటుగా స్పందించారు. పవన్ – పోసాని ఇద్దరూ ఇండస్ట్రీ పరువు పోకుండా వ్యవహరించాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు ప్రభుత్వల సహకారం ఇండస్ట్రీకి అవసరం అని బాబు మోహన్ అన్నారు. ఏపీ ప్రభుత్వాన్ని సినీ ప్రముఖులు ఓ సమస్యకు పరిష్కారం అడిగారు. దానికి వాళ్ళు సరే అన్నారు. దాని విమర్శించడం సరికాదు అని అన్నారు. ఏదైనా సమస్య ఉంటే మనమే పరిష్కరించుకొవాలి కానీ.. వ్యక్తిగత దూషణలు చేయడం వల్ల మన సినిమా ఇండస్ట్రీ పరువు పోతోంది.  ఏదైనా అన్యాయం జరిగితే పెద్ద మనుషులతో కూర్చొని సాల్వ్ చేసుకోవాలి అంటూ బాబూమోహన్చెప్పుకొచ్చారు. .

మరిన్ని ఇక్కడ చదవండి : 

Chiranjeevi: రాజమండ్రిలో అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరంజీవి

Bandla Ganesh: నామినేషన్‌ను ఉపసంహరించుకున్న బండ్ల గణేష్..

Hyderabad: ఇద్దరు జూనియర్ ఆర్టిస్టుల ఆత్మహత్య.. అవకాశాల్లేక.. అనుకున్నది సాధించలేక..