ఇరుముడిని వెంటాడుతున్న వివాదాలు.. మందు తాగే వాళ్ళు మాత్రమే వేస్తారా..? సినిమాపై అయ్యప్ప భక్తులు ఫైర్

మాస్ మహరాజా రవితేజ- శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ సినిమా ‘ఇరుముడి’. తండ్రి, కూతుళ్ల సెంటిమెంట్‌ తో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇరుముడి సినిమా ఇప్పటికే రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.

ఇరుముడిని వెంటాడుతున్న వివాదాలు.. మందు తాగే వాళ్ళు మాత్రమే వేస్తారా..? సినిమాపై అయ్యప్ప భక్తులు ఫైర్
Irumudi

Updated on: Sep 08, 2026 | 3:18 PM

రవితేజ నటించిన ఇరుముడి సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. అంతా బాగుంది. రవన్న ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. చాలా కాలంగా హిట్స్ లేక సతమతం అవుతున్న రవితేజ ఇరుముడి సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా 200కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ అద్భుతంగా తెరకెక్కించారు. కథ, కథనం అన్ని ప్రేక్షకులను ముఖ్యంగా అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే గతంలో ఇరుముడి సినిమా ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.. ప్రభుత్వ పాఠశాల టీచర్స్ గురించి సినిమాలో తప్పుగా చూపించారని కొందరు విమర్శలు చేశారు.

ఎన్టీఆర్, పవన్, మహేష్‌లతో ఆడిపాడింది.. కట్ చేస్తే ఇప్పుడు కనిపించకుండాపోయింది.

ఈ విమర్శలతో పాటు సినిమాను అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు. దీనిపై శివ నిర్వాణ క్లారిటీ కూడా ఇచ్చాడు. ఎవ్వరిని కించపరచలేదని.. కొందరు విష పురుగులు కూడా ఉంటారని చెప్పడమే తన ఉద్దేశమని శివ క్లారిటీ ఇచ్చారు. దాంతో ఆ గొడవ సద్దుమణిగింది. ఇక ఇప్పుడు మరో వివాదం ఇరుముడిని చుట్టుముట్టింది. సినిమాలో హీరో అయ్యప్ప మల వేసుకోవడం పై కొందరు విమర్శలు చేస్తున్నారు.

అలాంటి సినిమాలు ఆడవు అన్నారు.. కానీ నా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది: దుల్కర్ సల్మాన్

అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరుముడి సినిమాను తాము ఆలస్యంగా చూశామని అయితే సినిమాలో గురు స్వాములకు కళంకం తెచ్చేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం మందు తాగేవాళ్లే అయ్యప్ప మాల వేస్తారని, దీక్ష ముగిసిన వెంటనే మళ్లీ తాగుతారని అనే విధంగా ‘ఇరుముడి’ సినిమాలో చూపించారని అయ్యప్ప దీక్ష సమితి సభ్యులు ఆరోపించారు. అయ్యప్ప మల అనేది చాలా పవిత్రమైంది. ఇరుముడి కట్టుకొని శబరిమలకు వెళ్తే స్వామివారు ఆ కుటుంబాన్ని కాపాడారు అనే విధంగా కాకుండా.. ఇరుముడి అని పేరు పెట్టుకుని కమర్షియల్ అంశాలతో క్రైమ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించడం చాలా బాధగా ఉంది అయ్యప్ప దీక్ష ప్రచార సమితి సభ్యులు అన్నారు. ఈ సినిమాను తెరకెక్కించినందుకు హీరో, దర్శకుడితో పాటు చిత్రబృందం మొత్తం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి సభ్యులు. దీనిపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

Prabhas Sreenu: ఆ హీరో ఎవ్వరికీ రికమెండ్ చేయడు.. చాలా మొహమాటస్తుడు : ప్రభాస్ శ్రీను

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us