OTT Movie: కూతురి కోసం నరబలి.. ఓటీటీలో వణుకు పుట్టిస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్.. ఒంటరిగా చూడొద్దు
ఓటీటీలో హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజే వేరు.ఈ జానర్ సినిమాలు థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతుంటాయి. అలా ఇటీవలే స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ తెలుగు హారర్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన చిత్రాలు, వెబ్ సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేయనున్నాయి. మమిత బైజు చేసిన సెన్సేషనల్ హిట్ ‘బెత్లెహెమ్ కుడుంబ యూనిట్’, లవ్ సిరీస్, పూజా మేరీ జాన్, రోమాంచకం చిత్రాలు ఈ వారం స్ట్రీమింగ్ లిస్టులో ఉన్నాయి. వీటి సంగతి పక్కన పెడితే.. గత వారం ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఒక తెలుగు హారర్ థ్రిల్లర్ ఇప్పుడు టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఆడియెన్స్ ను బాగా భయపెడుతూ భారీ వ్యూస్ సొంతం చేసుకుంటోంది. అంతకు ముందు థియేటర్లలో రిలీజైనప్పుడు ఈ హారర్ థ్రిల్లర్ సినిమా పెద్దగా ఆడలేదు. జస్ట్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. అయితే ఓటీటీలోకి వచ్చాక మాత్రం ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు ఆడియెన్స్. ఈ సినిమా స్టోరీ కూడా కొత్తగా ఉంటుంది. చనిపోయిన మనిషిని బతికించడం కోసం ఓ క్షుద్రపూజ నిర్వహించడం అనే పాయింట్ చుట్టూ ఈ కథ సాగుతుంది. ఈ క్షుద్ర పూజ కోసం పక్కాగా ఓ ముహూర్తంలో పుట్టిన అమ్మాయిని బలి ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే అదే టైమ్ లో ఓ పాప పుట్టేలా చేస్తారు. కానీ ఆ పూజ పూర్తి కాకుండానే ఆ మాంత్రికుడి కుటుంబాన్ని చంపేస్తారు. సీన్ కట్ చేస్తే.. వుమెన్ వర్కింగ్ హాస్టల్ లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. అందులో ఒకామె ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేస్తుంటుంది. ఒక రోజు అనుకోకుండా ఇంట్లో ఫంక్షన్ కారణంగా తన ఫ్రెండ్ ను ఇన్సూరెన్స్ సమాచారం కోసం పంపిస్తుంది.ఇక్కడే అసలు కథ మొదలవుతుంది.. అక్కడికి వెళ్లిన ఫ్రెండ్ ను నరబలి చేసేందుకు ఆ కుటుంబం ప్లాన్ చేస్తుంది. అమ్మాయిని ఇంట్లో బంధించి క్షుద్ర పూజ ప్రారంభిస్తారు. మరి ఆ తర్వాత ఏమయింది? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఈ మిస్టరీ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు కర్మాఖ్య. . జబర్దస్త్ లో అదిరే అభిగా పేరు తెచ్చుకున్న కమెడియన్ అభినయ్ కృష్ణ డైరెక్టర్ గా మారి ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. సమైరా, సముద్రఖని, అభిరామి, ఆనంద్, శరణ్య ప్రదీప్, మధునందన్, వైష్ణవ్, ధనరాజ్, రాఘవ, ఐశ్వర్య, గడ్డం నవీన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో పెద్దగా ఆడని ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో నంబర్ వన్ ప్లేస్ లో ట్రెండింగ్ అవుతోంది.
కర్మాఖ్య సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




