
సినిమా వాళ్లపై మీడియా అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు దానికి సోషల్ మీడియా కూడా తోడయ్యింది. వాళ్ల కొత్త సినిమాల అప్ డేట్స్ మాత్రమే కాదు.. వారి డేటింగ్, డివర్స్ ఇష్యూలు, సెలబ్రిటీల పిల్లలు, పేరెంట్స్ గురించి కూడా తెలుసుకునేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఏ డౌట్ వచ్చినా వెంటనే గూగుల్ తల్లిని అడిగి తెలుసుకుంటున్నారు. ఇక పబ్లిక్‌లో ఫేమ్ ఉన్న వాళ్లు తమకు సంబంధించిన ప్రతి డీటేల్స్ ఇన్ స్టా, ట్విట్టర్ వంటి సాధనాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఈ మధ్య అయితే వ్లాగ్స్ కూడా తోడయ్యాయి. అలానే హీరో, హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు సైతం బాగా ట్రెండ్ అవుతున్నాయి.
తమ అభిమాన సెలబ్రిటీ త్రోబ్యాక్ పిక్ కనిపిస్తే చాలు.. దాన్ని ట్రెండింగ్‌లోకి తెచ్చేందుకు ఫ్యాన్స్ చేయని ప్రయత్నం ఉండదు. తాజాగా ఓ హీరోయిన్ చిన్నప్పటి ఫోటోను మీ ముందుకు తెచ్చాం. తను ఎవరో మీరు గుర్తుపట్టగలరా..?. పోలికలు చూసి ట్రై చెయ్యండి.. అబ్బే మా వల్ల కావడం లేదు అంటే.. ఓ క్లూ ఇస్తాం. ప్రజంట్ డార్లింగ్ ప్రభాస్ సరసన ఓ మూవీలో నటించింది. నాకు తెలిసి ఇప్పటికి 90 శాతం మంది గెస్ చేసే ఉంటారు. ఇంకా తెలియనివాళ్లు హైరానా పడకండి. ఆన్సర్ మేమే చెప్పబోతున్నాం.
తనెవరో కాదు సన్నజాజి తీగలాంటి కృతి సనన్. మోడలింగ్‌తో తన కెరీర్‌ను స్టార్ యాక్టింగ్‌పై ఇష్టంతో సినీ రంగంలోకి ప్రవేశించింది కృతి సనన్. 2014లో వచ్చిన 1-నేనొక్కడినేలో మహేశ్ బాబు సరసన నటించి తెలుగువారికి పరిచయమైంది. అక్కినేని నాగచైతన్యతో దోచేయ్ సినిమా చేసింది. తెలుగులో స్టార్ హీరోలతో కలిసి నటించినా ఆమెకు బ్రేక్ రాలేదు. దీంతో బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తుంది. అక్కడ ఆమె నటించిన రాబ్తా, బరేలీ కి బర్ఫీ, లుక చుపి, పతి పత్ని ఔర్ వో మంచి విజయం సాధించాయి. ప్రస్తుతం మన డార్లింగ్ హిరో ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో నటిస్తోంది ఈ బాలీవుడ్ బ్యూటీ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.