ఆ రోజులు చాలా బాగుండేవి.. మళ్ళీ తిరిగి రామన్న రాని రోజులు అవి.. కాలం ముందుకు సాగుతోంది.. టెక్నాలజీ పెరిగిపోతుంది. అందరూ అప్డేట్ అవుతున్నారు. దాంతో మనం గడిపిన ఎన్నో మధుర క్షణాలు మనతోనే చివరివి అయ్యాయి. వాటిలో ఆగస్టు 15ఒకటి. స్వాతంత్ర దినోత్సవం 90’s కిడ్స్ కు అదొక పెద్ద పండగ లాంటిది. ఆగస్టు 15 వస్తుందంటే చాలు పదిరోజుల నుంచే హడావిడి మొదలయ్యేది. స్కూల్ లో డాన్స్ ప్రోగ్రామ్స్ కు పేర్లు ఇవ్వడం.. గేమ్స్ లో పేరులు ఇవ్వడం.. ఆ గేమ్స్ కోసం, డాన్స్ కోసం ప్రాక్టీస్ చేయడం భలేగా ఉండేది. క్లాస్ లో అందరం డబ్బులేసుకొని రంగు కాగితాలు, జెండాలు, బెలూన్స్ కొనుక్కొని. ఆగస్టు 15 ముందు రోజు సాయంత్రం క్లాస్ రూమ్ మొత్తం డెకరేషన్ చేసేవాళ్ళం.. బోర్డు పై స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అని రాసేవాళ్ళం.
ఇక ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి నీట్ గా రెడీ అయ్యేవాళ్ళం. అలాగే వైట్ అండ్ వైట్ డ్రస్సు.. వైట్ షూస్ వేసుకొని స్కూల్ కు బయలుదేరేవాళ్ళం.. ఇక స్కూల్ కు వెళ్లిన తర్వాత జెండా వందనం కోసం లైన్ లో నిలుచొని జెండా ఎగరగానే జనగణమన పాడుతూనే స్వీట్ ఏం ఇస్తారా అని ఆలోచించేవాళ్ళం. ఆ తర్వాత టీచర్స్ బోరింగ్ స్పీచ్ ఉండేది. ఎదో విని విననట్టు వినేవాళ్ళం.. ఆతర్వాత మిక్చర్, స్వీట్స్ పంచిపెట్టేవాళ్ళు.
ఆతర్వాత కల్చరల్ ప్రోగ్రాం .. క్లాస్ గర్ల్స్ డాన్సులు, పాటలు పాడటం ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆతర్వాత ఎంతో సంతోషంతో ఇంటికి తిరిగి వెళ్ళేవాళ్ళం. ఇక ఇంటికి వెళ్లిన తర్వాత డ్రస్ మార్చుకొని టీవీ ముందు కూర్చోగానే ఖడ్గం సినిమా మొదలయ్యేది. ఖడ్గం సినిమా సినిమా కాదు ఓ ఎమోషన్ అనే చెప్పాలి. ఎన్ని సార్లు చూసిన బోరు కొట్టని మూవీ.. ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినలిపించే సాంగ్స్.. దేశభక్తి సీన్స్, ఎమోషనల్ సీన్స్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కృష్ణవంశీ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. అలాగే దేవీ శ్రీ అందించిన మ్యూజిక్ వింటే తెలియని ఫీలింగ్ వస్తుంది. అలా మా ఆగస్టు 15 గడిచిపోయేది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..