సినిమా ఇండస్ట్రీలో హారర్ సినిమాలకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇప్పటికే ఈ జోనర్‌లో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన కాంచన సిరీస్‌లు మంచి విజయాలను అందుకున్నాయి. ఈ క్రమంలోనే డైరెక్టర్ సుందర్ హన్సిక – ఆండ్రియా ప్రధాన పాత్రల్లో నటించిన ‘అరణ్మనై’ .. త్రిష – హన్సిక కాంబినేషన్లో వచ్చిన ‘అరణ్మనై 2′ సినిమాలను తెరకెక్కించాడు. అరణ్మనై 2లో సిద్ధార్థ్ హీరో. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు అరణ్మనై 3’ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో రాశి ఖన్నా – ఆండ్రియాప్రధాన పాత్రాలు పోషిస్తున్నారు. ఆర్య హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు.
దసరా కానుకగా అక్టోబర్ 14వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తమిళ ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ‘అరణ్మనై 2’ లో ఉన్న సుందర్.సి – ఆండ్రియా పాత్రలు ఇందులో కూడా కొనసాగాయి. విజువల్స్ – గ్రాఫిక్ వర్క్ చూస్తుంటే భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తీసినట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్ సినిమా పై ఆసక్తిని పెంచింది. ఈ ట్రైలర్ పై మీరు ఒకలుక్కెయండి..
మరిన్ని ఇక్కడ చదవండి :