అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ప్రస్తుతం దేశ ప్రజలందరి దృష్టి ఈ చారిత్రాత్మక ఘట్టంపైనే ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగే ఈ మహాక్రతువును ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి మహా సాధువులు, పండితులు, సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రధాని నిన్నటి వరకు తమిళనాడులోనే పర్యటిస్తూ ఉన్నారు . అక్కడ ఖేలో ఇండియా గేమ్స్ ప్రారంభించడంతో పాటు రామునికి సంబంధించిన పలు చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించారు. ఈ నేపథ్యంలో యాక్షన్ కింగ్, ప్రముఖ నటుడు అర్జున్ సర్జా పీఎం మోడీని ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా చెన్నైలో తాను స్వయంగా నిర్మించిన హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు అర్జున్. అలాగే తన కుమార్తె, హీరోయిన్ ఐశ్వర్యతో కలిసి ప్రధాని మోడీకి అంజనేయ స్వామి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. అర్జున్ విజ్ఞప్తిపై ప్రధాని కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే హనుమాన్ ఆలయన్ని సందర్శిస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అర్జున్, మోడీల భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
అర్జున్ చివరిగా విజయ్ దళపతి లియో సినిమాలో మెరిశాడు. అందులో హరోల్డ్ దాస్‌గా నెగెటివ్ రోల్‌లో అభిమానులను మెప్పించాడు. ఇక అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో నటించింది. అయితే సరైన సక్సెస్ ఇంకా లేదు. త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెడుతోందీ అందాల తార.
తమిళ స్టార్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతి తో కలిసి ఏడడుగులు నడవనుంది ఐశ్వర్య. ఇటీవలే వీరి నిశ్చితార్థం వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఇదిలా ఉంటే మరికాసేపట్లో అయోధ్యకు చేరుకోనున్నారు ప్రధాని మోడీ. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొననున్నారు.
Y’day Veteran Actor Arjun Avl and his daughter met PM of Bharat Modi Avl, who visited Chennai to inaugurate Khelo India Games.
-Actor Arjun Avl requested PM to visit the Hanuman Temple which is built by him located in Chennai. PM replied him that soon he will visit.#TNwithModi pic.twitter.com/16151mxyv7
— Soma Sundaram 🇮🇳 (@isomasundaram72) January 20, 2024
My family likes PM Modi Avl very much. – Veteran Actor Arjun Avl
-I invited PM Modi to my Hanuman Temple. PM said he will come soon.#TNWithModipic.twitter.com/zpTfSBI0tI
— Soma Sundaram 🇮🇳 (@isomasundaram72) January 19, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.