Arjun Ambati: విరూపాక్ష సినిమా హీరోగా నేను చేయాల్సింది.. కానీ అలా మిస్ అయ్యింది.. అర్జున్ అంబాటి కామెంట్స్..
అర్జున్ అంబాటి హీరోగా నటిస్తోన్న లేటేస్ట్ సినిమా తెప్ప సముద్రం. ఇందులో 30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు కీలకపాత్రలో నటిస్తున్నారు. సతీష్ రాపోలు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కిశోరి దాత్రక్ కథానాయికగా నటిస్తుంది. బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 12న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే

అగ్నిసాక్షి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అర్జున్ అంబాటి. ఆ తర్వాత దేవత సీరియల్ తో మరోసారి అలరించారు. ఇక మొన్నటివరకు బిగ్ బాస్ సీజన్ 7లో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఐదో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టిన అర్జున్ తనదైన ఆట తీరుతో విన్నర్ రేసులో దూసుకుపోయాడు.. కానీ చివరుక టాప్ 5లో నిలిచాడు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు బయట ఎక్కడా కనిపించలేదు అర్జున్. ఇటీవలే తనకు పాప పుట్టిందని.. తమ కూతురికి అర్కా అనే పేరును పెట్టినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇదిలా ఉంటే చాలా కాలం తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు అర్జున్. ఇందులో సినిమాలు, సీరియల్స్, పర్సనల్ లైఫ్ గురించి అనేక విషయాలను చెప్పుకొచ్చాడు. అర్జున్.. సీరియల్స్ కంటే ముందు సినిమాల్లోనే నటించాడు. హీరోగా వెండితెరపై తన అదృష్టా్ని పరీక్షించుకున్నాడు. కానీ అక్కడ సరైన గుర్తింపు రాకపోవడంతో సీరియల్ హీరోగా మారాడు.
బుల్లితెరపై హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు అర్జున్. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. సాయి దుర్గ తేజ్ నటించిన విరూపాక్ష సినిమాకు ముందుగా తననే హీరోగా అనుకున్నారని.. కానీ కొన్ని కారణాలతో కుదరలేదని అన్నాడు. అర్జున్ మాట్లాడుతూ.. “డైరెక్టర్ కార్తీక్ నా స్నేహితుడు. ఎప్పుడూ అతను సినిమా ప్రపంచంలో ఉంటాడు. ఇద్దరం కలిసి లూప్ అనే వెబ్ ఫిల్మ్ చేశాం. ఆ తర్వాత ఓ సినిమా చేయాలనుకున్నాం. అందుకు కథ రెడీ చేసుకుని నిర్మాతల కోసం వెతికాం. కానీ కుదరలేదు. ఆ సినిమాకు ముందుగా శాసనం అని టైటిల్ పెట్టుకున్నాం. ఆ తర్వాత సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై ఆ సినిమా స్టోరీకి కొన్ని మార్పులు చేసి రూపొందించారు. అదే విరూపాక్ష. ఈ సినిమాకు ముందుగా లీడ్ రోల్ నన్ను అనుకున్నారు. కానీ కుదరలేదు. అయినా ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నాను. నాతో చేసుంటే అంత పెద్ద సక్సెస్ వచ్చేది కాదేమో” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అర్జున్ అంబటి కామెంట్స్ వైరలవుతున్నాయి.
అర్జున్ అంబాటి హీరోగా నటిస్తోన్న లేటేస్ట్ సినిమా తెప్ప సముద్రం. ఇందులో 30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు కీలకపాత్రలో నటిస్తున్నారు. సతీష్ రాపోలు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కిశోరి దాత్రక్ కథానాయికగా నటిస్తుంది. బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 12న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి నా నల్ల కలువా పువ్వా సాంగ్ రిలీజ్ చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




