Archana Jois: కేజీఎఫ్ కథ నచ్చలేదు… ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేసిన అర్చన జోయిస్‌

కేజీఎఫ్ సినిమాలో హీరో రాకీభాయ్‌ ఎంతగా గుర్తుండిపోయాడో, తల్లి శాంతమ్మ కూడా అంతే గుర్తుండిపోయింది. కేజీఎఫ్ సినిమాలో శాంతమ్మ పాత్రలో నటించిన నటి అర్చన జోయిస్‌. తాజాగా తన కేజీఎఫ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ల గురించి చెప్పిన ఆమె ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. కేజీఎఫ్ ఆఫర్ తనకు వచ్చే టైమ్‌ కు ఆమె వయసు 22 సంవత్సరాలే.

Archana Jois: కేజీఎఫ్ కథ నచ్చలేదు... ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేసిన అర్చన జోయిస్‌
KGF Fame Archana Joes

Edited By:

Updated on: Oct 19, 2023 | 6:22 PM

కేజీఎఫ్ సినిమాలో హీరో, హీరోయిన్, విలన్‌ తో పాటు హీరో తల్లి పాత్ర కూడా ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా అవుట్‌ అండ్ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కిన సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్‌ కు కూడా చేరువ చేసింది మదర్‌ రోల్‌. అందుకే ఈ సినిమాలో హీరో రాకీభాయ్‌ ఎంతగా గుర్తుండిపోయాడో, తల్లి శాంతమ్మ కూడా అంతే గుర్తుండిపోయింది. కేజీఎఫ్ సినిమాలో శాంతమ్మ పాత్రలో నటించిన నటి అర్చన జోయిస్‌. తాజాగా తన కేజీఎఫ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ల గురించి చెప్పిన ఆమె ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. కేజీఎఫ్ ఆఫర్ తనకు వచ్చే టైమ్‌ కు ఆమె వయసు 22 సంవత్సరాలే. ఆ ఏజ్‌ లో మదర్‌ రోల్ అంటే కెరీర్‌ ఇబ్బందుల్లో పడుతుందేమో అన్న ఉద్దేశంతో కేజీఎఫ్ సినిమాకు అర్చన నో చెప్పారు.

అయితే తల్లి పాత్రకు ఆమె పర్ఫెక్ట్ ఛాయిస్ అని ఫిక్స్ అయిన మేకర్స్‌ బందువులు, సన్నిహితుల ద్వారా అర్చనను ఒప్పించే ప్రయత్నం చేశారు. ఒకసారి కథ వినమని ఒత్తిడి చేశారు. దీంతో కథ వినడానికి ఒప్పుకున్న అర్చన, ఫుల్ నెరేషన్‌ విన్న తరువాత కూడా ఈ సినిమా చేయడానికి ఇష్టపడలేదు. అసలు ఫస్ట్ టైమ్ కథ విన్నప్పుడు తనకు నచ్చలేదని అర్చన క్లియర్‌ గా చెప్పేశారు.

కానీ ఫైనల్‌ గా మేకర్స్ ఒత్తిడితో కేజీఎఫ్‌ లో నటించేందుకు ఒప్పుకున్న అర్చన జోయిస్‌, ఆఫ్టర్ రిలీజ్‌ సినిమా రిజల్ట్ చూసి షాక్ అయ్యారు. తను ఏ మాత్రం ఊహించని రేంజ్‌ లో రిజల్ట్ రావటం, తన క్యారెక్టర్‌ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ రావటం హ్యాపీగా అనిపించింది అన్నారు. ఒకవేళ ఈ సినిమా మిస్ అయ్యుంటే తనకు ఈ రేంజ్‌ గుర్తింపు వచ్చి ఉండేది కాదన్నారు అర్చన.

అర్చన జోయిస్ ఇన్‌స్టా పోస్ట్..

తాజాగా ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన మాన్షన్ 24 వెబ్‌ సిరీస్‌ తో ఆడియన్స్‌ ముందుకు వచ్చారు అర్చన. ఈ షో ప్రమోషన్‌ కోసం హైదరాబాద్ వచ్చిన తన ఫిలిం కెరీర్‌ గురించి, పర్సనల్‌ లైఫ్ గురించి రివీల్ చేశారు. ఇటీవల డిజిటల్ ఆడియన్స్ ముందుకు వచ్చిన మాన్షన్ 24కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓం కార్ మార్క్ హారర్‌ థ్రిల్లర్ జానర్‌ లో తెరకెక్కిన ఈ షోలో సత్యరాజ్‌, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, రావు రమేష్‌ కీలక పాత్రల్లో నటించారు. అర్చన జోయిస్ ఓ ఎపిసోడ్‌ లో కీలక పాత్ర పోషించారు.