AR Rahman : నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు.. వివాదం పై స్పందించిన ఏఆర్ రెహమాన్..

ఆస్కార్ అవార్డ్ గ్రహీత, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ చిక్కుల్లో పడ్డారు. ఇటీవల తనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడంపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఏఆర్ రెహమాన్ కామెంట్స్ పై బాలీవుడ్ సెలబ్రెటీలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో తన మాటలపై వివరణ ఇస్తూ.. ఓ వీడియో షేర్ చేశారు.

AR Rahman : నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు.. వివాదం పై స్పందించిన ఏఆర్ రెహమాన్..
Ar Rahman

Updated on: Jan 18, 2026 | 2:28 PM

హిందీ సినిమా పరిశ్రమలో మతపరమైన పక్షపాతం ఉందని మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇటీవల చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో బాలీవుడ్ సినీప్రముఖులు ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని.. తన ఉద్దేశం అది కాదంటూ వివరణ ఇస్తూ వీడియో షేర్ చేశారు ఏఆర్ రెహమాన్. తన జీవితంలో, సంగీత ప్రయాణంలో భారతదేశం ఎల్లప్పుడూ కేంద్రంగా ఉందని చెబుతూ, రెహమాన్ తన మాటాలను ఇన్‌స్టాగ్రామ్‌లో స్పష్టం చేశారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని తాను ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. ఈక్రమంలో ఇప్పుడు మరోసారి ఏఆర్ రెహమాన్ షేర్ చేసిన వీడియో వైరల్ అయ్యింది.

ఎక్కువ మంది చదివినవి : Actress Raasi: ఉదయాన్నే 4 గంటలకు ఆ పనులు చేస్తా.. నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

“కొన్ని సందర్భాల్లో ఒకరి ఉద్దేశాలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. నా వ్యాఖ్యలతో ఎవరికైనా బాధ కలిగించాలనే ఉద్దేశం నాకు లేదు. నా నిజాయితీని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నా వ్యాఖ్యలను మతంతో ముడిపెట్టి చూడడం సరైనది కాదు. నేను చెప్పాలనుకున్నది ఒకటే. ఒకప్పుడు సంగీతానికి కళాకారులకు ఉన్న ప్రాధాన్యం ఇప్పుడు తగ్గుతుంది. కమర్షియల్ అంశాలే ఎక్కువ అవుతున్నాయి. కళ, సంగీతానికి ఇవ్వాల్సిన గౌరవం తగ్గిపోతుందన్న బాధతోనే మాట్లాడాను. నేను ఎప్పుడు ఎవరినీ బాధపెట్టాలని అనుకోలేదని అన్నారు. భారతదేశం నా గురువు, నా ఇల్లు.” అంటూ చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Prabhas: ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది.. ఆరోజు రాత్రి.. డార్లింగ్ బెస్ట్ ఫ్రెండ్ కామెంట్స్..

భారతీయుడిగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నాని.. తన భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడానికి.. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన కళాకారులతో కలిసి పనిచేయడానికి ఈ దేశమే తనకు అవకాశం ఇచ్చిందని అన్నారు. సంగీతం నా కోసం ఎప్పుడూ దేశ సంస్కృతిని అనుసంధానించే, గౌరవించే, వేడుకగా చేసుకునే ఒక మార్గం అని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Child Artist: షూటింగ్‏లో యాక్సిడెంట్.. 2 ఏళ్లు నరకం అనుభవించా.. సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్..